తెలంగాణ

telangana

అక్రమార్కులపై ఏసీబీ కొరడా.. భారీగా బంగారం, వజ్రాలు స్వాధీనం

By

Published : Mar 22, 2022, 1:21 PM IST

Bengaluru ACB raids: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభావితం చేసి.. వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న కొందరి మధ్యవర్తులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. బెంగళూరులోని 9 మంది ఏజెంట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

Bengaluru ACB raids
అక్రమార్కులపై ఏసీబీ కొరడా

Bengaluru ACB raids: ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా.. ప్రభావితం చేస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 9 మంది ఇళ్లపై అనివీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. వీరిలో కొందరు మధ్యవర్తులు కాగా.. మరికొందరు ఏజెంట్లు ఉన్నారు. వీరు బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

దాడిలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, వస్తువులు
అక్రమార్కుల ఇళ్లపై ఏసీబీ దాడులు

ఈ దాడుల్లో నగరంలోని ఆర్​టీ నగర్​కు చెందిన మోహన్​ అనే వ్యాపారవేత్త నుంచి 4.960కేజీల బంగారం, 15.02 కేజీల వెండి, 61.9 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వ్యాపారవేత్త మోహన్​ ఇంట్లో ఏసీబీ రైడ్​
విచారిస్తున్న ఏసీబీ అధికారులు

"బెంగళూరు నగరంలో అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం వారిపై రైడ్​ చేశాము. వీరంతా బెంగళూరు డెవలప్​మెంట్​ అథారిటీలో పని చేసే ఉద్యోగులను ప్రభావితం చేసి వారితో పని చేయించుుకుంటున్నట్లు అనుమానిస్తున్నాం. మొత్తం తొమ్మిది మంది ఇళ్లపై దాడులు జరిగాయి."

- అవినీతి నిరోధక శాఖ, కర్ణాటక

ఈ దాడుల్లో సుమారు 100 మంది అధికారులు భాగమైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరికి ఎస్పీ ఉమా ప్రశాంత్​ నాయకత్వం వహించినట్లు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న వెండి

ఇదీ చూడండి:ఆ కిట్​లో రబ్బరు పురుషాంగం- ఆశా వర్కర్లు షాక్​

ABOUT THE AUTHOR

...view details