తెలంగాణ

telangana

'ప్రజాస్వామ్యం అణచివేతకు యత్నం.. ఆ చీకటి రోజులు మరవొద్దు!'

By

Published : Jun 26, 2022, 12:44 PM IST

PM MODI EMERGENCY: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'మన్​కీ బాత్​' కార్యక్రమంలో ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు ఎమర్జెన్సీ సమయంలో ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ఆ చీకటి రోజులను ఎవరూ మరిచిపోకూడదని అన్నారు.

pm modi emergency
ప్రధాని మోదీ

PM MODI EMERGENCY: 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య మార్గాల ద్వారా నియంతృత్వాన్ని ప్రజలు ఓడించడంలో ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో మరొకటి దొరకటం కష్టమని అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన 'మన్​కీ బాత్'​ కార్యక్రమంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఆ సమయంలో ప్రజా హక్కులను కాలరాశారని విమర్శించారు.
1975 జూన్​ 25న ఎమర్జెన్సీని విధించిన ఇంధిరా గాంధీ.. 1977 మార్చి21న ఎత్తివేశారు.

"ఎమర్జెన్సీ సమయంలో అన్ని హక్కులను హరించారు. ఈ హక్కులలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ముఖ్యమైనది. ఈ ఆర్టికల్​ను అణగదొక్కారు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాశారు. దేశంలోని ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు, మీడియా, రాజ్యాంగ సంస్థలపై ఆంక్షలు విధించారు. వేల మంది పౌరుల అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా భారతీయులకు ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలేకపోయారు. ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే ప్రజలు ఎమర్జెన్సీని ఎత్తేసేలా చేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశ ప్రజల పోరాటంలో భాగస్వామిని కావడం నా అదృష్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మనం ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని మరిచిపోకూడదు. భవిష్యత్ తరాలు కూడా తప్పక గుర్తు పెట్టుకోవాలి. "

ABOUT THE AUTHOR

...view details