ETV Bharat / bharat

ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

Maharashtra political crisis: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తిరుగుబాటు నేత ఏకనాథ్​ శిందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ సీఎం ఫడణవీస్​తో శిందే రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ముంబయికి రెబెల్‌ ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, మరికొన్నాళ్లు గువాహటిలోనే ఉండాల్సి రావచ్చని తిరుగుబాటు వర్గ నేత ఒకరు వెల్లడించారు.

శిందే
శిందే
author img

By

Published : Jun 26, 2022, 8:45 AM IST

Maharashtra political crisis: రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి! దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీతో శివసేన అసమ్మతి వర్గం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వడోదరలో కీలక చర్చలు జరిగాయని సమాచారం. భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో అక్కడకు వెళ్లి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వడోదరలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కొత్త సర్కారు ఫార్ములాపై ఇరు పక్షాల మధ్య అవగాహన కుదరటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముంబయికి రెబెల్‌ ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, మరికొన్నాళ్లు గువాహటిలోనే ఉండాల్సి రావచ్చని తిరుగుబాటు వర్గ నేత ఒకరు వెల్లడించడం గమనార్హం. మరోవైపున అసమ్మతి వర్గం.. తమ గ్రూప్‌ను 'శివసేన (బాలాసాహెబ్‌)గా' ప్రకటించుకోవడంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మండిపడింది. శివసేన, దాని వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే పేరును ఉపయోగించుకునే హక్కు ఇతరులెవరికీలేదని తెలిపింది. శనివారం ముంబయిలో సమావేశమైన పార్టీ జాతీయ కార్యవర్గం ఆరు తీర్మానాలు చేసింది. రెబెల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఉద్ధవ్‌కు అధికారమిచ్చింది.

.

ఠాక్రేను గద్దె దిగమనలేదు: రెబెల్‌ ఎమ్మెల్యేల ప్రతినిధి

కాంగ్రెస్‌, ఎన్సీపీల జట్టు వీడి భాజపాతో కలిసి శివసేన సాగాలన్నదే తమ ప్రాథమిక డిమాండని తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం అధికార ప్రతినిధి దీపక్‌ కెసర్కర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు కుదుర్చుకుని పోటీ చేశామో వారితోనే ప్రయాణం కొనసాగించాలని అత్యధిక శివసైనికులు కోరుకుంటున్నారని తెలిపారు. ఠాక్రే రాజీనామాను తాము కోరడం లేదన్నారు. శనివారం గువాహటిలోని హోటల్‌ నుంచి వర్చువల్‌ విధానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీపక్‌ పాల్గొన్నారు. 'మేం శివసేనను వీడలేదు...మరో పార్టీలో మా వర్గాన్ని విలీనం చేయడం లేదు' అని తెలిపారు. శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందేను కాకుండా ఠాక్రే వర్గం సూచించిన వ్యక్తిని గుర్తించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామన్నారు. కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి పార్టీ శాసనసభా పక్షనేత ఎలా అవుతారని ప్రశ్నించారు. వీడియో కాల్‌ ద్వారా మా బలాన్ని ఉప సభాపతి తెలుసుకోవచ్చన్నారు. శిందే వర్గం ఠాక్రే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తుందా అని ప్రశ్నించగా.. 'మేమెందుకు మద్దతు ఉపసంహరించాలి? శివసేన మాదే. పార్టీని హైజాక్‌ చేసింది మేం కాదు...ఎన్సీపీ, కాంగ్రెస్‌లే. పార్టీని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఠాక్రే రాజీనామా చేయాలని మేం కోరడంలేదు' అని బదులిచ్చారు. భాజపాతో చేతులు కలుపుదామని ఉద్ధవ్‌ను చాలా కాలంగా కోరుతున్నామన్నారు. తమ వర్గం పేరును 'శివసేన (బాలాసాహెబ్‌)'గా నిర్ణయించినట్లు చెప్పారు. 'ఇప్పుడు ఎమ్మెల్యేలు ముంబయికి తిరిగి రావడం క్షేమం కాదు. తగిన సమయంలో వస్తాము' అని మరో ప్రశ్నకు దీపక్‌ కెసర్కర్‌ సమాధానమిచ్చారు. హోటల్‌ ఖర్చులను అసమ్మతి ఎమ్మెల్యేలే భరిస్తున్నారని, భాజపా నేతలకు దీనితో సంబంధం లేదన్నారు.

.

ముంబయిలోని పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం భేటీ అయిన శివసేన జాతీయ కార్యవర్గం 6 తీర్మానాలను ఆమోదించింది. ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు పూర్తి అధికారమిచ్చింది. శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే పేరును ఇతర రాజకీయ సంస్థలు ఉపయోగించరాదని తీర్మానించింది.

అసమ్మతి ఎమ్మెల్యేలకు శాసనసభ సెక్రటరీ సమన్లు
శాసనసభ్యులుగా అనర్హతకు సంబంధించి ఇచ్చిన నోటీసులకు సోమవారం సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని తిరుగుబాటు నేత శిందే సహా 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ శనివారం సమన్లు జారీ చేశారు. శివసేన (ఠాక్రే వర్గం) చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు ఇచ్చిన లేఖలోని జాబితా ప్రకారం ఈ సమన్లు వెళ్లాయి.

అవిశ్వాసం నోటీసును తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్‌
తనపై అవిశ్వాసం ప్రకటిస్తూ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ తోసిపుచ్చారు. ఆ నోటీసుపై 33 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకం చేసినా..గుర్తు తెలియని మెయిల్‌ నుంచి పంపారన్న కారణంతో తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అసమ్మతి వర్గంలో ఉన్న ఆరుగురు రాష్ట్ర మంత్రులు 24 గంటల్లో వారి పదవులను కోల్పోతారని సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. శిందే వర్గం ఎమ్మెల్యేలుంటున్న అయిదు నక్షత్రాల హోటల్‌ బిల్లు ఎవరు చెల్లిస్తున్నారని ఎంవీఏ భాగస్వామి ఎన్సీపీ ప్రశ్నించింది. ఎక్కడి నుంచి నల్లధనం వస్తుందో తేల్చాలని ఐటీ, ఈడీలను కోరింది.

ఇదీ చూడండి : 'ఫ్రీ ఫైర్​'లో బాలికతో పరిచయం.. ఖతర్ నుంచి వచ్చి కిడ్నాప్.. నేపాల్​కు తీసుకెళ్తుండగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.