తెలంగాణ

telangana

భారత్​పై మరో కుట్ర- బోర్డర్​ వద్ద 140 మంది ఉగ్రవాదులు!

By

Published : Aug 5, 2021, 5:43 PM IST

జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 140 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని సీనియర్​ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. అయితే.. వారు చొరబడకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటోందని చెప్పారు. భారత్​-పాక్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణాలు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.

pak terrorists in line of control
పాక్ ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు దాదాపు 140 మంది ఉగ్రవాదులు.. నియంత్రణ రేఖ వెంబడి ఎదురు చూస్తున్నారని ఓ సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. భారత్​, పాక్​ మధ్య ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతుల నిర్మాణాలు ఇంకా అలానే ఉన్నాయని చెప్పారు.

ఫైనాన్షియల్​ యాక్షన్ టాస్క్ ఫోర్స్​(ఎఫ్​ఏటీఎఫ్​) 'గ్రే' జాబితాలో నుంచి బయటపడేందుకు కాల్పులు విరమణ ఒప్పందానికి పాక్​ కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని సదరు అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతులను తొలగిస్తే.. ఈ విషయంలో పాక్​ నిబద్ధత నిరూపితమవుతుందని అన్నారు.

"నియంత్రణ రేఖ వద్ద దాదాపు 140 మంది ఉగ్రవాదులు.. భారత్​లోని జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే.. సరిహద్దు వద్ద పటిష్ఠమైన సైన్యం బందోబస్తు వల్ల వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. గతంలోకి వారు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు మన సైనికులు తిప్పికొట్టారు. దాంతో వారు మళ్లీ అలాంటి యత్నాలు చేయలేదు."

-సీనియర్ భద్రతా అధికారి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాకుగా చూపి, నియంత్రణ రేఖ వద్ద మౌలిక వసతుల నిర్మాణాన్ని పెంచుకునేందుకు పాకిస్థాన్ యత్నిస్తోందని సదరు అధికారి హెచ్చరించారు. జమ్ముకశ్మీర్​కు రెండేళ్ల క్రితం ప్రత్యేక హోదాను ప్రభుత్వ హోదాను రద్దు చేసినప్పటి నుంచి విదేశీ ఉగ్రవాదులు కనమరుగయ్యారని చెప్పారు. రహస్య ప్రదేశాల్లో వారు దాక్కున్నారని పేర్కొన్నారు. స్థానికులెవరూ ఉగ్రవాదులతో చేతులు కలపకుండా ఉండేలా.. వారి మానసిక స్థితిని మార్చేందుకు సైన్యం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

నియంత్రణ రేఖ వద్ద శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్, పాకిస్థాన్ ఫిబ్రవరిలో​ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తు.చ. తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. రెండు దేశాల సైన్యాల డైరక్టర్​ జనరళ్ల స్థాయి చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

ఇవీ చూడండి:

కశ్మీర్​ లోయలో తెరపైకి కొత్త ఉగ్ర సంస్థలు

Hybrid militants: భద్రతా దళాలకు సరికొత్త సవాలు!

ఉగ్రవాదుల ఏరివేత- 98మంది హతం!

ABOUT THE AUTHOR

...view details