తెలంగాణ

telangana

స్కూల్ టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం.. పుట్టిన గంటల్లోనే..!

By

Published : Dec 12, 2022, 12:14 PM IST

తమిళనాడులో ఓ పాఠశాల టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పుట్టిన వెంటనే శిశువును ప్రభుత్వ బాలికల పాఠశాల టాయిలెట్ వద్ద పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

An infants body found in a government school toilet near tamil nadu
An infants body found in a government school toilet near tamil nadu

తమిళనాడులో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల టాయిలెట్​ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన డిసెంబర్​ 8న జరగగా ఆలస్యంగా బయటకు వచ్చింది. పుట్టిన వెంటనే శిశువును టాయిలెట్ వద్ద పడేశారు. తిరుచ్చి జిల్లాలోని తిరువెరుంపూర్ సమీపంలోని కట్టూర్‌లోని ఓ స్కూల్ టాయిలెట్ వద్ద నవజాత మగ శిశువు శవంగా కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల ఆవరణలోనే ఈ శిశువు పట్టిందా?లేక ఎవరైనా ఈ శిశువును తీసుకొచ్చి పాఠశాల టాయిలెట్​ వద్ద వదిలేశారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థినులలో ఎవరికైనా ఈ బిడ్డ పుట్టిందా? అనే అనుమానంతో విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు పాఠశాల ఆవరణలో సరిపడా సెక్యూరిటీ గార్డులను నియమించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details