తెలంగాణ

telangana

Dimple Hayati news : డింపుల్‌ ఇంట్లోకి చొరబడ్డ యువతీయువకుడు.. అందుకోసమేనా..?

By

Published : May 26, 2023, 12:02 PM IST

Updated : May 26, 2023, 12:10 PM IST

Actress Dimple Hayathi Controversy Latest Update : హీరోయిన్ డింపుల్‌ హయాతి.. ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే వ్యవహారంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డింపుల్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. ఆమెకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆమె తరఫు న్యాయవాది పాల్‌ సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా డింపుల్​ ఇంట్లోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం కలకలం సృష్టించింది. ఇంతకీ వాళ్లెవరంటే..?

Actress Dimple Hayathi Controversy Latest Update
Actress Dimple Hayathi Controversy Latest Update

Actress Dimple Hayathi Controversy Latest Update : ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టిన కేసులో నటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదైన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పోలీస్‌ అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించి విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని.. ఈ విషయంలో చట్టపరంగా పోరాడతామని ఆమె తరఫు న్యాయవాది పాల్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డింపుల్‌కు ప్రాణహాని ఉందని.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆరోపించారు.

Fans enters into Dimple Hayathi Home : ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు డింపుల్ ఇంట్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం డింపుల్‌ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించారు. ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఆ ఇద్దరు.. నేరుగా సీ2లో ఉండే డింపుల్‌ నివాసంలోకి వెళ్లారు. పని మనిషి వారిని ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేస్తుండగా.. అంతలోనే ఇంట్లో ఉన్న కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లారు. వారిని వెంబడిస్తూ లిఫ్టు లోపలికి వెళ్లిన కుక్క.. వెంటనే తిరిగి బయటకు వచ్చేసింది.

డింపుల్‌ను కలవడానికి వచ్చాం.. : విషయం తెలుసుకున్న డింపుల్‌ హయాతి తక్షణమే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని యువతి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతీయువకుడు కొప్పిశెట్టి సాయి బాబు, అతని బంధువు శ్రుతిగా గుర్తించి స్టేషన్‌కు తరలించారు. ఆ ఇద్దరిని విచారించగా.. తాము డింపుల్‌ హయాతి అభిమానులమని.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి వచ్చామని తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో ఆమెను ఓసారి కలవడానికి వచ్చినట్లు వివరించారు. పోలీసులు ఈ విషయాన్ని డింపుల్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వారిద్దరిని విడిచి పెట్టమని చెప్పారు. దాంతో వారిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఠాణా నుంచి పంపించేశారు.

ఇదీ.. అసలు వివాదం.. : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయాతి, ఆమె అనుచరుడు డేవిడ్‌లు నివాసం ఉంటున్నారు. డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్‌ చేతన్ కుమార్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్ చేస్తుంటారు. డింపుల్‌, డేవిడ్‌లు ఆ వాహనం పక్కనే తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన డింపుల్ హయాతి తన కారుతో డీసీపీ రాహుల్‌ హెగ్డే ప్రభుత్వ వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో డీసీపీ కారు ముందు భాగం దెబ్బతింది. సీసీ ఫుటేజీ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్.. జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. డింపుల్‌, డేవిడ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి..:

Actress Dimple Hayathi Controversy Update : 'హీరోయిన్ డింపుల్‌ హయాతికి ప్రాణహాని..!'

Dimple Hayathi Controversy : ఐపీఎస్ అధికారి Vs టాలీవుడ్ హీరోయిన్.. తప్పెవరిది..?

Last Updated :May 26, 2023, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details