AAI ATC Jobs 2023 :విమానయాన రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్త. న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఏఏఐ కార్యాలయాల్లోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల (AAI Junior Executive Jobs 2023)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం ఖాళీలు..
AAI ATC Job Vacancy : 496 - జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులు
ఏజ్ లిమిట్..
AAI ATC Jobs Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
విద్యార్హతలు..
AAI ATC Jobs For Engineers :అభ్యర్థులు బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము(AAI ATC Jobs Application Fee)..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000/- దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసిన అభ్యర్థులకు కూడా ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.
ఎంపిక విధానం (AAI ATC Jobs Selection Process)..
- రాత పరీక్ష(ఆన్లైన్ టెస్ట్)
- వాయిస్ టెస్ట్
- సైకోయాక్టివ్ సబ్స్టాన్స్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్