తెలంగాణ

telangana

wedding called off at last minute : కాసేపట్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వధువు.. కట్‌ చేస్తే..!

By

Published : May 8, 2023, 5:04 PM IST

A wedding was called off at the last minute in Jagtial : చివరి నిమిషాల్లో పెళ్లి ఆగిపోవడం.. ఇదివరకు ఎక్కువగా సినిమాల్లో చూసేవాళ్లం. కట్నకానుకల విషయంలో గొడవలతో కొన్ని, ప్రేమ వ్యవహారాలతో మరికొన్ని, ఇతరత్రా కారణాలతో ఇంకొన్ని.. ఇలా రీజన్‌ ఏదైనా కాసేపట్లో జరగాల్సిన వివాహం కాస్తా చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అవుతుంటుంది. అచ్చం ఇలాంటి సీనే జగిత్యాల జిల్లాలో రిపీటైంది. పెళ్లైతే ఆగిపోయింది కానీ.. అందుకు కారణం తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే..! మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ 'అక్కా-బావ-ఓ చెల్లి' స్టోరీ చదివేయండి.

wedding called off at last minute
wedding called off at last minute

A wedding was called off at the last minute in Jagtial : తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పెళ్లి చేసేశారు. గారాల పట్టీ అయిన చిన్న కూతురి వివాహం.. ఉన్నంతలో అంగరంగ జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులతో ఇళ్లంతా సందడిగా మారిపోయింది. అప్పటి వరకు వివాహ పనులతో అలసిపోయిన వారంతా.. ఉదయాన్నే తొందరగా లేవాలనుకుంటూ నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు, బంధువులంతా తెల్లవారుజామునే లేచి పెళ్లి పనులు మొదలెట్టారు. ముహూర్తానికి మరికొన్ని గంటలే ఉండటంతో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

తెల్లవారినా పెళ్లి కూతురు ఇంకా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అలసిపోయి నిద్ర పోతుందేమోలే అనుకున్నారు. ఒకటి, రెండుసార్లు డోర్‌ కొట్టినా.. లోపలి నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఇంకాసేపు పడుకోనీలే అనుకుని ఊరుకున్నారు. చూస్తుండగా ముహూర్తం టైం దగ్గరపడుతుంది. ఇక లాభం లేదనుకుని పెళ్లి కూతురిని లేపేందుకు మరోసారి గది వద్దకు వెళ్లారు. పిలిస్తే పలకకపోవడంతో ఫోన్‌ చేశారు. స్విచ్ఛాఫ్‌ రావడంతో వారిలో మెల్లిగా ఆందోళన మొదలైంది. బలవంతంగా డోర్‌ తెరిచి చూసేసరికి ఇంట్లో బెడ్‌పై పడుకుని ఉండాల్సిన అమ్మాయి లేదు.

చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆందోళన అంతకంతకూ ఎక్కువవుతుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఈ టైంలో తమ పక్కనే ఉండాల్సిన చాలా దగ్గరి బంధువు ఒకరూ కనిపించకపోవడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆందోళన కాస్తా అనుమానంగా మారింది. కొన్ని పరిణామాల అనంతరం చివరకు అదే నిజమైంది. దీంతో పెళ్లి కుమారుడి తరఫు బంధువులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని చావు వార్త చల్లగా చెప్పడంతో చివరి నిమిషంలో ఆ వివాహం రద్దైంది. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో ఆదివారం జరగాల్సిన ఓ పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది. కన్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి.. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన యువకుడితో ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంటి వద్దే వివాహం ఏర్పాటు చేయడంతో కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తెల్లవారుజామున వధువు అదృశ్యం కావడంతో వివాహం నిలిచిపోయింది. వధువు అక్క భర్త సైతం కనిపించకపోవటం, ఇద్దరి సెల్‌ఫోన్లూ స్విచ్ఛాఫ్‌ అని రావడంతో ఇద్దరూ కలిసే అదృశ్యమైనట్లుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు వారిని వెతికే పనిలోపడ్డారు. చివరి నిమిషంలో పెళ్లి నిలిచిపోవటంతో వచ్చిన బంధువులంతా వెనుదిరిగారు.

ఇవీ చూడండి..

నుదిటిపై సింధూరం పెట్టకుండా ముఖంపై చల్లిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్​ చేసుకున్న వధువు!

పెళ్లి కోసం 4 గంటల పెరోల్​.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు..

ABOUT THE AUTHOR

...view details