తెలంగాణ

telangana

గర్భిణీ శునకానికి రక్తదానం.. పెద్ద మనసు చాటుకున్న జిమ్మీ

By

Published : Mar 13, 2023, 8:25 AM IST

మనుషులకు మనుషులే సహాయం చేసేందుకు వెనకాడే ఈ రోజుల్లో జంతువులు మాత్రం వాటి పెద్ద మనసును చాటుకుంటున్నాయి. అనారోగ్యానికి గురైన తోటి శునకానికి రక్తం దానం చేసింది మరో శునకం. జంతువులు వాటంతట అవి ఎలా దానం చేస్తాయి అనుకోవద్దు. శునకం యజమాని దానితో రక్త దానం చేయించారు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

a dog donates blood to a pregnant dog in karnataka
కర్ణాటకలో గర్భిణి శునకానికి మరో శునకం రక్తదానం

కర్ణాటకలోని హవేరి జిల్లాలో అక్కి ఆలూర్ గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ గర్భిణీ శునకానికి రక్తదానం చేసింది మరో శునకం. రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణీ శునకానికి ఈ మేరకు సాయం చేసింది. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని అసలు కథేంటో మీకోసం.

జిప్సీ అనే రెండు నెలల శునకం అనారోగ్యం పాలైంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జిమ్మి అనే శునకం యజమాని దాని రక్తాన్ని దానం చేయించాడు. జిప్సీ(శునకం) రెండు నెలల గర్భవతి. దానికి ఆరోగ్యం బాగోలేకపోతే దాని యజమాని వెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జిప్సీ రక్తలేమి సమస్యతో బాధపడుతోందని వైద్యులు చెప్పారు. దీంతో వేరే శునకం రక్తం అవసరం పడింది. డాక్టర్ కూడా జిప్సీకి రక్తం ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న జిమ్మీ యజమాని వైభవ్​ పాటిల్.. ఆ శునకానికి రక్తదానం చేయించాలనుకున్నాడు. ఆస్పత్రికి వెళ్లి జిప్సీకి రక్తదానం చేయించాడు వైభవ్. గర్భిణి జిప్సీకి రక్తం అందించడం వల్ల.. ఇప్పుడు దాని ఆరోగ్యం మెరుగుపడింది. రక్తం డొనేట్ చేసినందుకు జిప్సీ యజమాని.. జిమ్మీ యజమానికి ధన్యవాదాలు తెలిపారు.

గర్భిణి శునకానికి రక్తదానం చేసిన మరో శునకం

హవేరిలోని హనగల్ తాలూకాలోని అక్కి ఆలూర్ రక్త దానానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక శునక రక్త దాతని మనం చూడవచ్చు. రక్తం అవసరమైన వారికి సహాయం చేసేందుకు అక్కి ఆలూరులో రక్తదాతల బృందం ఏర్పడింది. జిప్సీ, జిమ్మీల యజమానులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. మనుషులు రక్త లోపంతో ఉంటే వెంటనే వెళ్లి ఎవరో ఒకరు రక్త దానం చేస్తుంటారు. శునకాలు రక్త లోపంతో బాధపడుతున్నప్పుడు కూడా మనుషుల లాగానే వాటికి అవసరమైనప్పుడు రక్తం లభించడం గొప్ప విశేషం.

గర్భిణి శునకానికి రక్తదానం చేసిన మరో శునకం

అయితే, స్థానికులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైంది. శునకాల కోసం ఏర్పాటైన బృందం.. పెంపుడు జంతువుల్లో రక్త లోపాన్ని అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అవసరమైనప్పుడు రక్తాన్ని అందించేలా శునకాల యజమానులకు అవగాహన కల్పించింది. ఇది ఫలితాలు ఇవ్వడం గొప్ప విజయం అంటున్నారు ఆ గ్రూపు సభ్యులు. ఎన్నోసార్లు రక్తదానం చేసి.. ప్రస్తుతం రక్త దానంతో జిప్సీ ఆరోగ్యాన్ని కాపాడి మరింత ప్రశంసలు పొందింది ఆ గ్రామం.

ఈ అరుదైన రక్తదానం.. వెటర్నరీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అమీత్ పురాణికర్, బ్లడ్ టెస్టర్ దాదాపీర్ కలదగి, డాక్టర్ సంధోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోజుల్లో.. మరో జంతువు ప్రాణాలను కాపాడేందుకు తన పెంపుడు కుక్కతో రక్తదానం చేయించిన యజమాని వైభవ్ పాటిల్ అందరి ప్రశంసలను అందుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details