తెలంగాణ

telangana

7.5లక్షల దివ్వెలతో దీపోత్సవం- సర్వాంగ సుందరంగా అయోధ్య ముస్తాబు

By

Published : Nov 3, 2021, 1:37 PM IST

దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అయోధ్య ముస్తాబైంది(ayodhya deepotsav 2021). రామ్‌కీ పౌడీ ఘాట్‌లో 7లక్షల 50వేల దీపాలు వెలిగించి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీపోత్సవంతో(ayodhya diwali 2021) పాటు రామాయణ ఇతివృత్తం తెలిపేలా కళాకారులు గీసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి.

ayodhya deepotsav-program
సర్వాంగ సుందరంగా అయోధ్య ముస్తాబు

మరో ప్రపంచ రికార్డును ముద్దాడేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. వరుసగా ఐదో సంవత్సరం కూడా రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపోత్సవ కార్యక్రమాన్ని(ayodhya deepotsav 2021) ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిసోంది. ఘాట్​లో మొత్తం 7లక్షల 50వేల దీపాలతో పాటు, అయోధ్య పట్టణమంతటా దివ్వెలు వెలిగించే కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు(ayodhya diwali 2021). రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపాలు వెలుగులకు సంబంధించి మొత్తం 12వేల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. అటు దీపోత్సవంతో(ayodhya deepotsav news) పాటు రామమందిరం, నగరంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలు తెలిపేలా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవం కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య సహా యూపీ నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే దీపోత్సవానికి(ayodhya diwali 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. సూర్యుడి అస్తమయం అనంతరం అయోధ్య నగరం దీప కాంతులతో వెలుగొందనున్నట్లు పేర్కొన్నారు.

దీపోత్సవం కోసం అయోధ్య(ayodhya news) ఎంత సుందరంగా ముస్తాబయిందో ఈ ఫొటోల్లో చూడండి.

రామాయణ ఇతివృత్తంతో రంగోలీ వేస్తున్న యువతులు
దీపోత్సవం కోసం అయోధ్యలో వేసిన రంగోలీలు
రంగోలీలతో సుందంగా ముస్తాబైన రామ్​ కీ పౌడి ఘాట్​
దీపాలు సిద్ధం చేస్తున్న వలంటీర్లు
రంగోలీలు చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు
రామాయణాన్ని ప్రతిబింబించేలా వేసిన రంగోలీలు
దీపోత్సవం కోసం సిద్ధమైన రామ్​కీ పౌడీ ఘాట్​
అత్యంత ఆకర్షణీయంగా కన్పిస్తున రంగోలీలు
సీతారాముల ప్రతిమలు రూపొందించిన కళాకారులు
సీతారాములు, అయోధ్య గుడితో ఆకర్షణీయమైన రంగోలి
రామ్ కీ పౌడీ దీపోత్సవానికి సిద్ధంగా ఉన్న దివ్వెలు
భారత్ మ్యాప్​తో అవధ్​ యూనివర్సిటీ విద్యార్థులు వేసిన రంగోలీ
అవధ్ యూనివర్సిటీ విద్యార్థులు వేసిన రంగోలి
విద్యార్థులు రూపొందించిన రాముడు, సీత, లక్ష్మణుడి రంగోలీ
రంగోలీ సిద్ధం చేసిన అవధ్​ యూనివర్సిటీ విద్యార్థులు
దీపోత్సవం కోసం దివ్వెలు సిద్ధం చేస్తున్న వలంటీర్లు
నృత్యప్రదర్శన కోసం సాధన చేస్తున్న కళాకారులు
రామాయణ ఇతివృత్తంతో సైకత శిల్పం రూపొందిస్తున్న కళాకారుడు
సీతా దేవి, హునుమంతుని ప్రతిమలను రూపొందించిన కళాకారులు
దీపోత్సవంలో నృత్య ప్రదర్శన కోసం సాధన చేస్తున్న కళాకారులు

ఇదీ చదవండి:అయోధ్యలో ఇసుకతో రామాయణం చెప్పిన సైకతశిల్పి

ABOUT THE AUTHOR

...view details