తెలంగాణ

telangana

వరుణుడి బీభత్సానికి కేరళలో 42మంది మృతి

By

Published : Oct 20, 2021, 7:55 PM IST

కేరళలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 42మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 304 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.

42 people have died due to rains and landslides between 12th Oct to 20 Oct.
వరుణుడి బీభత్సానికి కేరళలో 42మంది మృతి

కేరళలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో అక్టోబర్ 12 నుంచి 20వరకు 42 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. మరో ఆరుగురు గల్లంతయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 304 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరందరినీ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే వారికి సాయం అందుతుందన్నారు.

ఆరెంజ్ అలర్ట్ వెనక్కి..

బుధవారం కేరళలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ(ఐఎండీ) దాన్ని వెనక్కి తీసుకుని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలే కురుస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 21 మరో 9 జిల్లాలకు జారీ చేసిన ఆరెంజ్ అలెర్ట్​ను కూడా ఐఎండీ ఉపసంహరించుకుంది. అయితే ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో మాత్రం గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వారం రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నిటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చరియలు విరిగి పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.

ఉత్తరాఖండ్​లో 46మంది..

ఉత్తరాఖండ్​లో వర్షాలు తగ్గినప్పటికీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇంకా అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. రోడ్లు కూడా తిరిగి తెరుచుకోలేదు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 46మంది చనిపోయారు. మరో 11మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 1,300మందిని ఎన్డీఆర్​ఎఫ్​ రక్షించింది.

బంగాల్, సిక్కింలోనూ..

బంగాల్​, సిక్కింలోనూ బుధవారం భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు, రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది.

ABOUT THE AUTHOR

...view details