తెలంగాణ

telangana

ముంబయి పేలుళ్లు..29 ఏళ్లకు దొరికిన నలుగురు నిందితులు

By

Published : May 18, 2022, 5:23 AM IST

Mumbai Blast 1993: ముంబయి వరుస పేలుళ్ల కేసులో 29 ఏళ్ల తర్వాత నలుగురిని అరెస్ట్​ చేశారు. నలుగురిని మే 12న అహ్మదాబాద్​ ప్రాంతంలోని సర్దార్​నగర్​లో అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అధికారులు తెలిపారు.

mumbai blast 1993
mumbai blast 1993

Mumbai Blast 1993: ముంబయి వరుస పేలుళ్ల కేసులో 29 ఏళ్ల తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​). అబు బాకర్, సయ్యద్​ ఖురేషీ, మహ్మద్ యూసఫ్​, మహ్మద్​ షోయబ్​లను చేసినట్లు మంగళవారం తెలిపింది. ఈ నలుగురిని మే 12న అహ్మదాబాద్​ ప్రాంతంలోని సర్దార్​నగర్​లో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్​ ఏడీజీ అమిత్​ విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నకిలీ పత్రాలు సమర్పించి పాస్​పోర్టులు పొందారనే ఆరోపణలపై కేసు నమోదైందని.. అనంతరం పేలుళ్ల కేసులో సీబీఐకి అప్పగిస్తామన్నారు. గతంలోనే సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్​పోల్​ అధికారులు వీరిపై రెడ్​ కార్నర్​ నోటీసులు జారీ చేశారు. నిందితులపై పాస్​పోర్ట్ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

1990లో ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్​ ఇబ్రహీం నేతృత్వంలో వీరు పనిచేశారని ఏటీఎస్​ డీఐజీ దీపన్​ భద్రన్​ తెలిపారు. 1993లో నకిలీ పాస్​పోర్టుతో పశ్చిమాసియా దేశాలకు వెళ్లినట్లు చెప్పారు. పేలుళ్ల కుట్రలో ఈ నలుగురు పాల్పంచుకున్నారని.. అనంతరం నకిలీ పత్రాలతో పాస్​పోర్ట్​ పొందినట్లు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన టాడా కోర్టు నేరస్థులుగా నిర్థరించారు. మార్చి 12, 1993న ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది మరణించగా..700 మందికి పైగా గాయపడ్డారు. ప్రత్యేక టాడా కోర్టు 100 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా.. ప్రధాన కుట్రదారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి:వైన్స్​ షాప్​పై ఉగ్రవాదుల 'గ్రనేడ్​' దాడి.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details