తెలంగాణ

telangana

30 అడుగుల కొబ్బరి చెట్టు.. మొలకెత్తిన 20 మొక్కలు.. గ్రామస్థుల పూజలు

By

Published : Jan 13, 2023, 10:06 AM IST

single coconut tree without soil support
అరుదైన కొబ్బరి చెట్టు

భూమి మీద కొబ్బరి చెట్లు మొలవడం సహజమే. అయితే కొబ్బరి చెట్టుపైనే ఏకంగా 20 కొబ్బరి మొక్కలు మొలకెత్తాయి. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

కొబ్బరి చెట్టుపై మొలకెత్తిన మొక్కలు.. ఎక్కడో తెలుసా?

కొబ్బరి చెట్టుకి కొబ్బరి కాయలు కాయడం సహజమే. అయితే కర్ణాటకలోని తుమకూరులో ఓ కొబ్బరి చెట్టుపై ఏకంగా 20 మొక్కలు మొలకెత్తాయి. ఈ సంఘటనను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ జరిగింది..
తుమకూరు జిల్లా మల్లదేవరహళ్లికి చెందిన రంగప్ప అనే రైతు తోటలో 30 అడుగుల కొబ్బరి చెట్టు ఉంది. అయితే ఆ కొబ్బరి చెట్టుపై 20 మొక్కలు మొలకెత్తాయి. ఈ చెట్టును రంగప్ప కుటుంబీకులు గత కొంతకాలంగా పూజిస్తున్నారు. అలాగే ఈ చెట్టును పూజిస్తే మంచి జరుగుతుందని రంగప్ప అంటున్నారు.

'చాలా ఏళ్లుగా మా తోటలో ఉన్న కొబ్బరి చెట్టుకు పూజలు చేస్తున్నాం. కొబ్బరి చెట్టు వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. మా గ్రామస్థులు సైతం కొబ్బరి చెట్టు వద్దకు వచ్చి పూజలు చేస్తారు. ఈ చెట్టును పూజిస్తే మంచి జరుగుతుందని వాళ్లు కూడా నమ్ముతున్నారు' అని రైతు రంగప్ప తెలిపారు.

కొబ్బరి చెట్టుపై మొలకెత్తిన మొక్కలు
కొబ్బరి చెట్టుకు పూజలు

'రంగప్ప అనే రైతు తోటలో ఉన్న కొబ్బరి చెట్టు ప్రకృతి ప్రసాదం. ఇలాంటి కొబ్బరి చెట్టును నేను ఎక్కడా చూడలేదు. మట్టిలో కాకుండా కొబ్బరి చెట్టుపై 20 మొక్కలు మొలకెత్తడం ఆశ్చర్యంగా ఉంది. కొబ్బరి చెట్టుపై మొక్కలు ఎలా పెరిగాయనే విషయంపై సంబంధిత అధికారులతో చర్చిస్తాను. గ్రామస్థులు ఈ చెట్టును పూజిస్తున్నారు.'

--జయరాం, తృణధాన్యాల సంఘం అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details