తెలంగాణ

telangana

మదర్సా హాస్టల్​ గదిలో 12ఏళ్ల విద్యార్థి దారుణ హత్య.. తల, శరీరం రెండు వేర్వేరుగా..

By

Published : Aug 13, 2023, 5:48 PM IST

Updated : Aug 13, 2023, 6:21 PM IST

12 Year Old Student Found Beheaded : మదర్సా హాస్టల్​ గదిలో ఓ 12 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. తల, శరీరం రెండు వేర్వేరుగా పడి ఉండడం వల్ల ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అసోంలో జరిగిందీ ఘటన. మరోవైపు, కేరళలో ఓ పెయింటర్​ శరీర భాగాలు.. పొలంలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి.

12 Year Old Student Found Beheaded
12 Year Old Student Found Beheaded

12 Year Old Student Found Beheaded : అసోం.. కచార్​ జిల్లాలోని ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థి.. అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. బాధితుడి తల, శరీరం రెండు వేర్వేరుగా హస్టల్​ గదిలో పడి ఉండడం చూసి అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. మృతుడిని రబీజుల్​ హుస్సేన్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని దారుస్ సలామ్ హఫీజియా మదర్సాలో ఈ ఘటన జరిగింది. రబీజుల్ హుస్సేన్ అనే విద్యార్థి.. శనివారం రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లాడు. అయితే ఆదివారం ఉదయం.. ప్రార్థనల కోసం విద్యార్థులను నిద్ర లేపేందుకు వారి గదిలోకి ఉపాధ్యాయుడు వెళ్లాడు. అప్పుడు అక్కడ రబీజుల్​.. విగతజీవిగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి మృతదేహాన్ని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ గదిలో ఉన్న 20 మంది తోటి విద్యార్థులతోపాటు మదర్సాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కుళ్లిపోయిన స్థితిలో పెయింటర్​ శరీరభాగాలు లభ్యం..
Kerala Murder Case :కేరళ.. కోజికోడ్​ జిల్లాలోని పొలంలో కాలిపోయి, కుళ్లిపోయిన స్థితిలో శరీర భాగాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడిని రాజీవ్​గా గుర్తించారు. వారం రోజులుగా అతడు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.

పోలీసుల సమచారం ప్రకారం.. జిల్లాలోని ఉరల్లూరు గ్రామంలోని పొలంలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి కాలును చూసి స్థానికులు భయపడ్డారు. వెంటనే పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో డ్రోన్​ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ పొలంలో ఇతర శరీర భాగాలు లభ్యమయ్యాయి. అదే ప్రాంతంలో చెప్పులు, దుస్తులు, మొబైల్​ ఫోన్​ దొరికాయి. దీంతో అవి తన భర్తవేనని బాధితుడి(54) భార్య పోలీసులకు తెలిపింది. బాధితుడు స్థానికంగా పెయింటర్​గా పనిచేస్తున్నట్లు చెప్పింది.

పెయింటర్​ శరీర భాగాలు దొరికిన పొలం ఇదే..

అయితే పొలంలో.. పోలీసులు ఉన్న సమయంలో ఓ జాగిలం అక్కడే ఉన్న ఇంట్లోకి పరిగెత్తింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు కన్నూర్ సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్ వెల్లడించారు. ఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజ్​ లభించలేదని చెప్పారు.

కారులో పిల్లల ముందే భార్య హత్య..
Husband Murdered Wife In Car :ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాలో ఓ వ్యక్తి.. కారులో పిల్లల ఎదుటే తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం కారులో మృతదేహాంతోనే ఉన్నాడు. జాతీయ రహదారి పెట్రోలింగ్​ సిబ్బంది.. కారుపై అనుమానం వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది.

పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం..జిల్లాలోని సఫీపుర్‌కు చెందిన రాహుల్ మిశ్ర (37).. రాయ్​బరేలీకి చెందిన బాధితురాలిని 2008లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ తన కుటుంబంతో లఖ్​నవూలో ఉంటున్నాడు. శనివారం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో లఖ్​నవూ నుంచి రాయ్‌బరేలీకి బయలుదేరాడు. మార్గమధ్యలో కారును జాతీయ రహదారిపై పార్క్​ చేశాడు. ఆ తర్వాత పిల్లలిద్దరి ముందే భార్యను గొంతుకోసి హత్య చేశాడు.

ఆ తర్వాత పెట్రోలింగ్ బృందానికి రాహుల్​ కారుపై అనుమానం వచ్చి అక్కడికి చేరుకున్నారు. కారు డోర్​ తెరవమని పోలీసు బృందం కోరగా.. అతడు తొలుత నిరాకరించాడు. ఆ తర్వాత కారు డోర్ తెరిచాడు. లోపల ఉన్న పిల్లలిద్దరూ తమ తండ్రి.. తల్లిని గొంతు కోసి చంపినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకున్నారు.

Last Updated :Aug 13, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details