తెలంగాణ

telangana

త్రివర్ణ కాంతుల్లో మెరిసిన చారిత్రక కట్టడాలు

By

Published : Oct 21, 2021, 9:02 PM IST

Updated : Oct 21, 2021, 11:08 PM IST

దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసుల(100 crore vaccine) మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభిన్నంగా అభినందనలు తెలిపింది. దేశంలోని వివిధ చారిత్రక కట్టడాలను మువ్వన్నెల కాంతులతో ముస్తాబు చేసి, కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి కృతజ్ణతలు తెలిపింది.

heritage monuments lit in tricolour
త్రివర్ణ కాంతుల్లో చారిత్రక కట్టడాలు

త్రివర్ణ కాంతుల్లో మెరిసిన చారిత్రక కట్టడాలు

దేశంలో కరోనా టీకా పంపిణీ 100 కోట్ల డోసుల మార్క్​(100 crore vaccine) దాటిన సందర్భంగా.. దేశంలోని వంద చారిత్రక కట్టడాలపై జాతీయ జెండా మెరుపుల్ని వెలిగించినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గురువారం పేర్కొన్నారు.

యునెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టూంబ్, తుగ్లకాబాద్ కోట, పురానా ఖిలా, ఆగ్రా, రామప్ప గుడి, హంపి, ధోలవీర, చారిత్రక ప్రాంతాలతో పాటు దేశంలోని మరిన్ని చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు విరజిమ్మాయి. కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి త్రివర్ణ వెలుగులతో కృతజ్ణతలు(India Vaccination status) తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న కోల్​కతాలోని కరెన్సీ బిల్డింగ్​
కోల్​కతాలోని మెట్​కాఫే హాల్​కు త్రివర్ణ కాంతులు
దిల్లీలోని హుమాయున్ సమాధికి త్రివర్ణ కాంతులు
హుమాయున్​ సమాధి వద్ద దృశ్యం
జాతీయ జెండా మెరుపు కాంతుల్లో దిల్లీలోని కుతుబ్​ మినార్​
దిల్లీలోని ఎర్రకోటకు త్రివర్ణ కాంతులు
త్రిపురలోని భువనేశ్వరి దేవాలయానికి మువ్వన్నెల సొబగులు
జాతీయ జెండా రంగుల్లో మెరిసిపోతున్న భువనేశ్వరీ దేవాలయం
మువ్వన్నెల కాంతులతో హైదరాబాద్​లోని చార్మీనార్​


ఇవీ చూడండి:

Last Updated : Oct 21, 2021, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details