ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మోహన్ బాబుకు కోపమొచ్చింది.. వ్యాపారులపై ఎందుకు మండిపడ్డాడంటే..!

By

Published : Apr 5, 2023, 10:38 PM IST

Babu Jagjeevan Ram Jayanti తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర్య సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఛైర్మన్ మోహన్ బాబు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై చెత్త వేసే షాపుల యజమానులను ఆయన గట్టిగా హెచ్చరించారు.

Babu Jagjeevan Ram Jayanti
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Swachh Bharat program at Mohan Babu University: బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర్య సమర యోధుడు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 20వేల విద్యార్థులతో రంగంపేట నుంచి రామిరెడ్డి పల్లి వరకు రోడ్ల పై చెత్తను శుభ్రం చేశారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర్య సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా జరిగాయి. వేడుకలను ఛైర్మన్ మంచు మోహన్ బాబు, సిఈఓ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2కిలోమీటర్లు వరకు 20వేల మంది విద్యార్థులతో కలసి రోడ్డుపై చెత్తచెదారాన్ని శుభ్రం చేశారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ లాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు స్వచ్చ భారత్ పాటించాలంటుని కోరుతున్నట్లు చెప్పారు. రంగంపేట పరిసర ప్రాంతంలో చెత్త తరలించేందుకు స్థలం చూపాలని ప్రభుత్వాన్ని కోరినా సమాధానం లేదన్నారు. కాలేజ్ పై ఆధారపడి 100కు పైగా బాలుర, బాలికల వసతి సముదాయాలు ఉన్నాయని వెల్లడించారు. రోడ్డు వేసి ప్లాట్ ఫామ్ కట్టి చెత్త బుట్టలు ఇస్తే చెత్తను రోడ్ల పై వేస్తున్నారని మండిపడ్డారు. చెత్త రోడ్డు పై వేసే షాపుల యజమానులకు ఆయన గట్టిగా హెచ్చరించారు.
భారతదేశ గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మోహన్ బాబు యూనివర్సిటీలోని 20 వేల మంది విద్యార్థులతో చెత్త సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, సిఈఓ మంచు విష్ణు అన్నారు. భారతీయులు విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం చాలా డర్టీగా ఉండడం బాధాకరమైన విషయమన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు కోసం వెళ్లిన వాళ్లందరూ ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదన్నారు. అందువల్లే ఇండియాకు మచ్చ తీసుకొస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యతో పాటు దేశభక్తిని నేర్పిస్తున్నామని విష్ణు తెలిపారు. ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం ఈరోజు స్వచ్చ భారత్ పాటించినట్లు విష్ణు వెల్లడించారు. ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజికి సంబందిచిన యాజమాన్యాలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం శుభ్రంగా ఉంటుందన్నారు. మొదట మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రారంభించాం, ఇది ఇక్కడితో ఆపమని నెలకు ఒకటి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపడుతామని మంచు విష్ణు వెల్లడించారు. ‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details