ETV Bharat / state

ప్రధాని రోడ్‌ షోలో భద్రతా వైఫల్యం - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కేంద్రం - Central Serious letter to AP DGP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 8:55 PM IST

Updated : May 23, 2024, 10:18 PM IST

Central Serious letter to AP DGP About Security Failures: ప్రధాని మోదీ ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ పంపింది. ర్యాలీ ప్రారంభానికి 45 నిమిషాల ముందు, ప్రారంభమైన తర్వాత, చివరిలో డ్రోన్స్‌ ఎగురవేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Central Serious letter to AP DGP
Central Serious letter to AP DGP (ETV Bharat)

Central Serious Letter to AP DGP About Security Failures: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల తీరును గర్హిస్తూ డీజీపీకి ఘాటు లేఖ పంపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో ఈనెల ఎనిమిదో తేదీన రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, మహాకూటమి అభ్యర్ధులు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. బందరు రోడ్డుపై నిర్వహించిన ఈ రోడ్డుషోకు అశేషంగా ప్రజలు తరలివచ్చారు.

అయితే ఈ సందర్భంగా ప్రధాని భద్రతా ప్రోటోకాల్‌ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభమైన తర్వాత, చివరిలోనూ డ్రోన్స్ గాలిలో ఎగురవేశారని, ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యంగా కేంద్రం ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ముందుగానే ప్రధాని రోడ్ షో ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. కానీ రాష్ట్ర పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోయారని ఆక్షేపించింది. ప్రధాని రోడ్ షోకు 45 నిమిషాల ముందు డ్రోన్‌లను గుర్తించిన ఎస్పీజీ, ఒక డ్రోన్‌ కదలికలను జామర్ల ద్వారా నిలిపివేసిందని, వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. ఆ తర్వాత కూడా డ్రోన్స్‌ ఎగురవేశారని, ఎస్‌పీజీ ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పుడు భద్రతా వైఫల్యంగా తేల్చుతూ, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి లేఖ చేరింది.

'ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం'- నివేదికపై సీఈవో మీనాకు ఈసీఐ ఆదేశాలు - ECI on PM Meeting Security Lapses

NDA Leaders Complaint to Election Commission: అయితే గతంలో పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో సైతం భద్రతా వైఫల్యం బయటపడింది. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. తాజాగా విజయవాడలో నిర్వహించిన రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది.

ప్రజాగళం సభ భద్రతా వైఫల్యం వెనుక రాష్ట్రప్రభుతం- ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన ఎన్డీఏ నేతలు

Last Updated : May 23, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.