ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Dec 4, 2022, 3:04 PM IST

TOP News
టాప్ న్యూస్ ()

.

  • విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఘన స్వాగతం పలికిన సీఎం, గవర్నర్
    President Murmu Ap Tour ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆమె ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉపాధికోసం గల్ఫ్ దేశానికి వెళ్లి.. పని వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య
    Woman Suicide: ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశానికి వెళ్లిన మహిళ పని ఒత్తిడి తాళ్లలేక అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేందుకు పంపిన ఏజెంట్లు సహకరించకపోవడంతో.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కేసు నమోదు అయ్యింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో పరిశ్రమలు వైసీపీ నేతలే పెట్టాలా..! ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలపై సాధింపులు
    Industries shifting to Other States పదుల సంఖ్యలో పరిశ్రమలు తరలిపోతున్నా.. వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ.. తన పంతమే ముఖ్యమని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇప్పటికి విఫల నేతనే.. ఎప్పటికీ కాదు: పవన్​ కల్యాణ్​
    Pawan Kalyan సినిమాలు తన జీవితం కోసమని.. రాజకీయాలు దేశం కోసమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ పేర్కొన్నారు. తాను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగా భావిస్తానని ఆయన అన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించాలని సీఏ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్​లో ఐసీఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెళ్లి సంతోషం ఆవిరి.. దండలు మార్చుకుంటుండగా వధువుకు గుండెపోటు
    ఉత్తర్​ప్రదేశ్​లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు మృతి చెందింది. దండలు మార్చుకునే సమయంలో వధువుకు గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే మరణించింది. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా ఏడుపులతో దద్దరిల్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెళ్లి తర్వాత భార్యకు గిఫ్ట్​గా హెలికాప్టర్​ రైడ్
    వివాహం అనంతరం హెలికాప్టర్​లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు. ఉత్తర్​ప్రదేశ్ రూడ్కీలోని చావ్​మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్​తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్​ చాంద్​పుర్​లో వీరి వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం వధువును హెలికాప్టర్​లో ఇంటికి తీసుకొచ్చాడు వరుడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరోసారి ట్విట్టర్​లో మస్క్ పోల్​.. వారి క్షమాభిక్షపై ప్రజాభిప్రాయం
    అమెరికా చీకటి రహస్యాలను బయటపెట్టిన ప్రజా వేగులు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌, వికీ లీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేలకు అమెరికా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలా..? అన్న అంశంపై మస్క్‌ ట్విట్టర్‌ పోల్‌ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొన్ని గంటల్లోనే లక్షల మంది పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా..
    పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకే, వీలైనంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తూ.. భవిష్యత్‌ ఖర్చులకు సిద్ధంగా ఉంటారు. విద్యా ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి మించి రాబడి ఆర్జించే మార్గాల్లో మదుపు చేయాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోహ్లీ ధోనీ కన్నా సచినే టాప్​ ఇండియన్​​ రిచ్చెస్ట్​ క్రికెటర్స్ వీరే
    భారతదేశం​లో రెండే మతాలున్నాయని అంటుంటారు చాలామంది. అందులో ఒకటి సినిమా ఐతే మరొకటి క్రికెట్. ఈ రెండింటిలో సక్సెస్​ కావడం చాలా అరుదు. భారత్​లో క్రికెట్​ చాలా మంది ఆడతారు. కానీ అందులో కొందరికే ప్లేయింగ్​ ఎలెవన్​లో స్థానం సంపాదించడం చాలా కష్టం. అలాంటి అడ్డంకులన్నింటినీ దాటుకుని క్రికెట్​ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు సచిన్​ తెందుల్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సినిమా సెట్​లో విషాదం.. షూటింగ్‌లో స్టంట్ మాస్టర్ మృతి
    సినిమా షూటింగ్​లో ప్రమాదం జరిగింది. యాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తుండగా.. ఓ స్టంట్​ మాస్టర్ జారి కింద పడ్డాడు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. కాగా, ఓ ప్రముఖ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details