ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉద్యోగులకు ఉండాలి: మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Nov 28, 2022, 10:34 AM IST

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమవేశం
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమవేశం

Ministers in a meeting of village ward secretariat employees: విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్య నారాయణ హామీ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రూల్స్ , పదోన్నతులు, బదిలీలు , తదితర అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలిస్తే ... గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. సీఎం సహా మంత్రులంతా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు.

విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం

Ministers in a meeting of village ward secretariat employees: ఉద్యోగులన్నాక ఎన్నో కోరికలు ఉంటాయని..వాటిని ప్రభుత్వం తీర్చలేదంటూ.. ఆందోళన బాట పట్టడం సరికాదని.. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగులకు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభకు.. మంత్రి సురేష్ తో కలిసి ఆయన హాజరయ్యారు. అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవుపలికారు.

సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు సహజమేనన్న ఆయన.. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు ఆర్థికంగా భారం కాదని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు ప్రభుత్వానికి సూచించగా.. ఐతే అన్నీ ఒకేసారి చేయలేమని మంత్రి తేల్చి చెప్పారు. రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎనర్జీ కార్యదర్శులు, మహిళా పోలీసులు , శానిటేషన్ కార్యదర్శులు లకు సర్వీసు రూల్స్ సహా బాధ్యతల అప్పగింత విషయమై స్పష్టత లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్ వీటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. శానిటేషన్ సిబ్బందికి వీక్లీఆఫ్ విషయమై త్వరలో మంచి వార్త చెబుతామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ఇవ్వడం సహా పదోన్నతులూ కల్పిస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details