ETV Bharat / state

ఉగ్రవాద పార్టీకి సజ్జల సలహాదారు: పవన్​ కల్యాణ్​

author img

By

Published : Nov 27, 2022, 7:25 PM IST

Updated : Nov 28, 2022, 7:23 AM IST

పవన్​ కల్యాణ్​
పవన్​ కల్యాణ్​

Annamayya Dam Victims: ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లను పడగొట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోనని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వారందరికీ.. 2024లో అధికారంలోకి వచ్చాక గట్టిగా జవాబు చెబుతామని హెచ్చరించారు. అన్నమయ్య డ్యామ్​ కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేసిన పవన్​.. చెట్లు నరికేవాళ్లు గరుడ పురాణం చదవాలన్నారు.

Pawan met with Annamayya Dam Victims: ఇళ్ల కూల్చివేత బాధితులైన ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై పవన్ నిప్పులు చెరిగారు. ఏ కారణంతో ఇప్పటంలో తమ మద్దతుదారుల ఇళ్లు కూల్చారో, అదే విధంగా 2024 తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లను పడగొడతామని హెచ్చరించారు. ఇప్పటంలో కూల్చివేతల వెనుక "షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి" ఉన్నారని ఆరోపించారు. వైకాపాను కూల్చేవరకూ నిద్రపోనన్న పవన్.. ఆ పార్టీ దెబ్బ కొట్టాలంటే భాజపా పెద్దలు, ప్రధానికి చెప్పి చేయాల్సిన అవసరం లేదన్నారు. తానే స్వయంగా తేల్చుకుంటానని స్పష్టంచేశారు.

వైసీపీ రాజకీయ పార్టీ కాదని, ఉగ్రవాద సంస్థ అంటూ పవన్‌ విరుచుకుపడ్డారు. అలాంటి ఉగ్రవాద సంస్థకు సజ్జలరామకృష్ణారెడ్డి సలహాదారు అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు పెడతామని వచ్చినవారినీ వైకాపా నేతలు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన కాదు రౌడీసేన అంటూ సీఎం జగన్ విమర్శించడాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. రౌడీయిజం, గూండాయిజం చేసే వాళ్లకు ఎదురుతిరగడం వల్ల.. వారికి రౌడీల్లా కనిపిస్తున్నామని అన్నారు. ప్రజల దృష్టిలో తమది విప్లవసేన అని పవన్‌ స్పష్టంచేశారు. కుల సమూహాలన్నీ దేహీ అనే ధోరణి నుంచి బయటకు రావాలని జనసేనాని పిలుపునిచ్చారు.

ఇసుక తవ్వకాల వల్లే..

ఇసుక తవ్వకాల వల్లే ఏడాది కిందట అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిందని పవన్‌ ఆరోపించారు. యంత్రాంగం నిర్లక్ష్యం, రాజకీయ వ్యవస్థ పర్యవేక్షణా వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. జలవనరుల శాఖలో లస్కర్‌గా పనిచేసే రామయ్య... అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోయి వరద తరుముకొస్తున్న వేళ 200 మందికి ఫోన్‌ చేసి ప్రాణాల్ని కాపాడారని ప్రశంసించారు. ఆయన్ని సత్కరించి, 2 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. థాయ్‌ బాక్సర్‌గా 22 ఏళ్లకే ఎన్నో పతకాల్ని సాధించిన వంశీకృష్ణ, వరదల దెబ్బకు తన కలల్ని చంపేసుకుని మూటలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న పవన్‌.. తిరిగి బ్లాక్‌బెల్ట్‌ టెస్ట్‌కు వెళ్లేలా మద్దతిస్తామని ప్రకటించారు.

పవన్​ కల్యాణ్​
లస్కర్​ రామయ్య, బాక్సర్​ వంశీకృష్ణను సన్మానిస్తున్న పవన్​

వంశీకృష్ణకు 50 వేల ఆర్థిక సాయం చేశారు. తనను కుమారుడిగా ఆదరించిన ఇప్పటం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మను వేదికపైకి పిలిచిన పవన్‌.. ఆమెకు పాదాభివందనం చేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చినందుకే ఇప్పటం గ్రామానికి పవన్‌ కల్యాణ్‌ 50 లక్షలు ప్రకటించారని.. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆ డబ్బును సీఆర్​డీఏ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాలని కొందరు లేఖ రాశారంటూ మండిపడ్డారు. పవన్‌ ఇస్తామన్న డబ్బు గ్రామాభివృద్ధి కోసమే తప్ప, జగన్‌మోహన్‌రెడ్డికి కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.