ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Botsa Respond on Manipur Issue: ఆందోళన వద్దు.. విద్యార్థులను తీసుకువస్తాం: మంత్రి బొత్స

By

Published : May 7, 2023, 5:47 PM IST

Updated : May 7, 2023, 7:53 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

AP Students in Manipur : మణిపూర్​లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను వెనక్కు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల వివరాల సేకరణ కొనసాగుతోందని, పర్యవేక్షణ కోసం అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

Botsa Respond on Manipur Issue : మణిపూర్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మణిపూర్​లో 150 మంది ఏపీ విద్యార్థులు ఉన్నట్లు అంచనా ఉందన్న బొత్స.. ఇప్పటికే వంద మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించామని వెల్లడించారు. పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌లు.. హిమాన్షు కౌశిక్‌, కమిషనర్‌, ఏపీ భవన్‌, కాంటాక్ట్‌ నంబర్‌ 88009 25668, రవిశంకర్‌, ఓఎస్‌డీ, ఏపీ భవన్‌, కాంటాక్ట్‌ నంబర్‌ 91871 99905 నియమించినట్లు మంత్రి తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిట్, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు టచ్​లో ఉన్నారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి స్టూడెంట్స్ లిస్ట్ ఔట్ చేశామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి బొత్స తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

సివిల్ ఏవియేషన్ మినిష్టర్​తో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు.. వివరాలు నమోదు చేసుకుంటే తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందకండి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 100 వరకు విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇంకా 50 మంది వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నామని చెప్తూ.. 150 మంది కి సరిపడా విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

పంట నష్టం లేదు.. అకాల వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో పెద్దగా పంట నష్టం లేదని మంత్రి బొత్స తెలిపారు. ప్రభుత్వం ప్రతి జిల్లా కి స్పెషల్ ఆఫీసర్ ని నియమించిందని, జిల్లా వారిగా సమీక్ష చేసి పంట నష్టాలు నమోదు చేస్తామని ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్న బొత్స.. పంట నష్టాలు విషయంలో ప్రభుత్వంపై బురద జల్లడం చంద్రబాబు నాయుడుకు అలవాటే అని విమర్శించారు. ఇలాంటి విమర్శలు పట్టించుకోమని, పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని బొత్స స్పష్టం చేశారు.

పరిస్థితులు అదుపులోకి.. మణిపూర్​లో ఘర్షణ వాతావరణం క్రమంగా చల్లారుతోంది. మైతీ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు స్థానిక గిరిజన జాతులు వ్యతిరేకించడం వల్ల చెలరేగిన హింస ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించడం వల్ల ప్రజలు రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో సైన్యం పటిష్ఠ నిఘా చర్యలు చేపట్టింది. గత కొద్దిరోజులుగా అట్టుడుకుతున్న మణిపూర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. దీంతో మణిపూర్ లోని కొన్నిప్రాంతాల్లో ఆంక్షలు సడలించారు. కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన చురచంద్‌పూర్‌ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు.

ఇవీ చదవండి :

Last Updated :May 7, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details