ETV Bharat / state

తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా - మొదటి రెండు ర్యాంకుల్లో పాగా - Telangana EAP Set

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 9:01 PM IST

AP Students Become Toppers in Telangana EAP Set: తెలంగాణలోని ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి.

telangana_eap_set
telangana_eap_set (ETV Bharat)

AP Students Become Toppers in Telangana EAP Set: తెలంగాణలోని ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాల్లో (Telangana EAP Set Results) ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి. ఆయా విభాగాల్లో తొలి 10 ర్యాంకుల్లో ఐదేసి చొప్పన మన రాష్ట్ర విద్యార్థులే సొంతం చేసుకున్నారు.

మెడికల్ విభాగం నీట్‌లోకి వెళ్లిన తర్వాత తెలంగాణలో ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ ర్యాంకుల్లో తొలి 10 ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తాచాటినట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) వెల్లడించింది.

ఆలయ భూములపై కన్ను - పూజారి కిడ్నాప్! 12 రోజులు చిత్రహింసలు - PRIEST KIDNAP

శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్‌.జ్యోతిరాదిత్య మొదటి ర్యాంకు సాధించారు. కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన గొల్లలేఖ హర్ష రెండో ర్యాంక్‌, కర్నూలుకు చెందిన మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి ఐదో ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ఆలూరు ప్రణీత ఒకటో ర్యాంకు కైవసం చేసుకుంటే విజయనగరం వాసి నాగుదాసరి రాధాకృష్ణ రెండు, చిత్తూరు వాసి సోంపల్లి సాకేత్‌ రాఘవ్‌ 4వ ర్యాంక్‌ సాధించారు.

ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ వెరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

గోదావరి పరివాహకమైనా కరవు సీమే- అధ్వానంగా ఉద్యాన రైతుల పరిస్థితి - Irrigation Problems to Farmers

ఇంజినీరింగ్‌లో ర్యాంకులు:

  • ఎస్‌.జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం- పాలకొండ)
  • హర్ష (కర్నూలు- పంచలింగాలు)
  • యశ్వంత్‌ రెడ్డి (కర్నూలు)
  • పుట్టి కుశల్‌ కుమార్‌ (అనంతపురం- ఆర్కేనగర్‌)
  • ధనుకొండ శ్రీనిధి (విజయనగరం)

అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకులు:

  • ప్రణీత (మదనపల్లె)
  • రాధాకృష్ణ (విజయనగరం)
  • సాకేత్‌ రాఘవ్‌ (చిత్తూరు)
  • వడ్లపూడి ముకేశ్‌ చౌదరి (తిరుపతి- వెంగమాంబపురం)
  • దివ్యతేజ (శ్రీసత్యసాయి జిల్లా- బలిజపేట)

అనంతపురంలో వజ్రాల వేట షురూ - ఎవరి అదృష్టం ఎలా ఉందో ఈసారీ! - Diamonds in Anantapur District

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.