ETV Bharat / state

కోనసీమ జిల్లాలో విషాదం- గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి - Three youths Died In Godavari River

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 6:15 PM IST

Updated : May 18, 2024, 8:19 PM IST

Three youths Died after Falling Into Godavari River: కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

Three_Youths_Died_After_Falling_Into_Godavari_River
Three_Youths_Died_After_Falling_Into_Godavari_River (ETV Bharat)

కోనసీమ జిల్లాలో విషాదం- గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి (ETV Bharat)

Three youths Died after Falling Into Godavari River: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం గౌతమి వంతెన వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువకుడికి ఈత రావటంతో సురక్షితంగా బయటపడ్డాడు.

ప్రాణం తీసిన ఈత సరదా- ఊపిరాడక ఇద్దరు విద్యార్థులు మృతి - Children drowned in the pond

వివరాల్లోకి వెళ్తే: రావులపాలెంకు చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వచ్చారు. ఒక యువకుడు గట్టుపై ఉండగా మిగిలిన నలుగురు గోదావరిలో దిగారు. సబ్బిళ్ల ఈశ్వర్ రెడ్డి, సత్తి సంపత్ రెడ్డి, పెంటా జయ కుమార్ గోదావరిలో గల్లంతవ్వగా, కొమ్మరి రాజేష్ అనే యువకుడు ఈత రావడంతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మృతులు ఈశ్వర్ రెడ్డి, జయకుమార్ మృతదేహాలను వెలికితీశాయి. సంపత్ రెడ్డి మృతదేహం కోసం గోదావరిలో గాలిస్తున్నారు.

ఈతకు వెళ్లి కృష్ణా నదిలో ముగ్గురు విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లిన స్నేహితులు మృతి: ఇటీవలే ఇలాంటి మరో ఘటన ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఇంద్రానగర్​లో చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన చిన్నారులు విగత జీవులుగా మారారు. వివరాలిలా: ఇంద్రానగర్​కు చెందిన అంజి(12), వలి(8) అనే ఇద్దరు స్నేహితులు దోర్నాల మండలం యడవల్లి శివారులోని క్వారీ గుంతకు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ నీళ్లలో మునిగి మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను క్వారీ నుంచి బయటకు తీశారు. ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

విషాదాన్ని నింపిన విహారయాత్రలు- ఈత కోసం దిగి ఐదుగురు విద్యార్థులు మృతి

Last Updated : May 18, 2024, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.