ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డీసీసీబీ విశ్రాంత ఉద్యోగి అరెస్ట్​పై డీఎస్పీ వివరణ

By

Published : Oct 29, 2020, 10:17 PM IST

లంపకలోవ సొసైటీ నిధుల దుర్వినియోగం కేసులో డీసీసీబీ విశ్రాంత ఉద్యోగి నరసింహ మూర్తిని పోలీసులు అరెస్ట్​చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకన్నారని.. ఆయన భార్య మీడియాను ఆశ్రయించారు. న్యాయస్థానం ఉత్తర్వులు చూపించనందుకే అరెస్ట్ చేశామని డీఎస్పీ వివరణ ఇచ్చారు.

dsp press meet
మీడియా సమావేశం నిర్వహిస్తున్న డీఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు డీసీసీబీ విశ్రాంత ఉద్యోగి నరసింహ మూర్తి అరెస్ట్​పై డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకొనే సమయంలో 'స్టే ఆర్డర్' చూపించలేదని తెలిపారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్​లో సిబ్బందితో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు.

లంపకలోవ సొసైటీ నిధుల దుర్వినియోగం కేసులో ఇతర నిందితులు న్యాయస్థానం ఉత్తర్వులు చూపించడంతో.. వారిని అరెస్ట్ చేయలేదన్నారు. 'స్టే ఆర్డర్' ఉన్న తన భర్తను ప్రత్తిపాడు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. నరసింహ మూర్తి భార్య రమణమ్మ మీడియాను ఆశ్రయించారు. ఇది జరిగిన 4 గంటల్లోనే.. డీఎస్పీ సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details