ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బిల్లులు చెల్లించకుంటే విద్యుత్​ కట్​.. పంచాయతీలకు నోటీసులు

By

Published : Jan 20, 2023, 9:47 PM IST

Etv Bharat
Etv Bharat

Panchayats Electricity Bills: అనకాపల్లి జిల్లాలో మేజర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు భారం గుదిబండలా మారింది. 24 గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.1.60 కోట్లు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించి పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు.

Panchayats Electricity Bills: అనకాపల్లి జిల్లాలో మేజర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు భారం గుదిబండలా మారింది. ఇప్పటికే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టించి వివిధ పనులకు ఉపయోగించడంతో సర్పంచులకు కనీసం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు నిధులు లేని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని పాయకరావుపేట మండలం లో 24 గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.1.60 కోట్లు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించి పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు.

ఇందులో పాయకరావుపేట మేజర్ పంచాయతీ సుమారు 48 లక్షలు రూపాయలు మేరకు బకాయిలు ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మిగిలిన గ్రామపంచాయతీలకు దాదాపు రూ 1.20 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని అధికారులు సర్పంచులపై ఒత్తిడి చేస్తున్నారు. తక్షణమే బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ వీధి దీపాలు, తాగునీటి పథకాల నిర్వహణకు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం తీరుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పంచాయతీలకు విద్యుత్ బిల్లు బకాయిల మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే సరఫరా ఆపేస్తాం: విద్యుత్ శాఖ అధికారులు

"ఎక్కువ బిల్లులు చూపించి కట్టమనడం చిన్న పంచాయతీల మాకు ఆర్థిక భారంగా ఉంటుంది. అభివృద్ధి పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి సదరు విద్యుత్ శాఖ స్పష్టమైన నోటీసులు ఇచ్చినట్లయితే బాగుంటుందని కోరుకుంటున్నాము." - విజయ్ రాజ్, అరట్లకోట పంచాయతీ కార్యదర్శి

"మా పంచాయతికి లక్ష రూపాయల నోటీసు వచ్చింది. విద్యుత్ చార్జీల రూపంలో పంచాయతీ నిధులన్నీ తీసుకుంటే గ్రామాలను సర్పంచ్ లు ఎలా అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. విద్యుత్ చార్జీలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనీ మేము కోరుకుంటున్నాం." -వంకా రమణ, వెంకటనగరం సర్పంచ్

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details