ప్రభుత్వానికి దగ్గర కాలేదు.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం: బండి శ్రీనివాసరావు

author img

By

Published : Jan 20, 2023, 5:30 PM IST

APNGO leader Bandi Srinivasa Rao

APNGO leader Bandi Srinivasa Rao: ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ వద్ద చెప్పడానికి వెళ్లినవాళ్లు.. ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీ ఎన్జోవీ సంఘం నేత బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ఇతర సంఘాలపై తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు. కార్యవర్గంతో పాటు ఐకాసతో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.

APNGO leader Bandi Srinivasa Rao: ప్రభుత్వం 2018 నుంచి డీఏ, ఎరియర్​లు, ఇతర బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. కార్యవర్గంతో పాటు జేఏసితో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ వద్ద చెప్పడానికి వెళ్లినవాళ్లు.. ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీఎన్జోవీ సంఘం నేత బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఏపీఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి దగ్గర కాలేదని.. ఉద్యోగుల ప్రయోజనాలు కోసమే తమ సంఘం పోరాడుతోందని స్పష్టం చేశారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ఇతర సంఘాలపై తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు.

ఏపీఎన్జీఓ సంఘం చాలా కాలం కిందట ఏర్పడిన పాత సంఘమని.. ఏపీజీఈఏకు అనుమతి ఎలా వచ్చిందో అందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీఓ సంఘం సాధించిన కారుణ్య నియామకాల ఉత్తర్వుల ద్వారానే సూర్యనారాయణకు ఉద్యోగం వచ్చిందన్నారు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలుగా సిగ్గు పడుతున్నామన్న ఆయన.. జీతాల కంటే ముందు పెన్షన్​ను ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. గత్యంతరం లేక ఈ పరిస్థితి దాపురించిందని.. దానికోసం పోరాడుతామని చెప్పారు. ప్రభుత్వం మర్యాద నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిల.. జీవో పండుగ కారణంగా ఆలస్యం అయిందని సీఎం చెప్పారన్నారు.

ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలనీ చట్టాలు, నిబంధనలు ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం పాటించడం లేదని విమర్శించారు. గవర్నర్ దగ్గరకు వెళ్లి ఏం ఉపయోగం ఉండదని.. మళ్ళీ వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వమే అని చెప్పారు. సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్​ను కోరుతామన్నారు. రోసా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంఘానికి గుర్తింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి దగ్గర కాలేదు.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం: బండి శ్రీనివాసరావు

డిమాండ్‌ విషయంలో గవర్నర్​ను కలిసిన సూర్యనారాయణ.. నువ్వు గవర్నర్​గారిని కలిస్తే ఉద్యోగుల సమస్యల గురించి చెప్పాలి. అంతేగానీ తోటి సంఘంగా ఉన్నటువంటి ఏపీఎన్జీవో సంఘం గురించి మీరు ఎందుకు కామెంట్​ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే ఈ సంఘం పుట్టింది.. ఉద్యోగుల రాయితీల కోసమే ఈ సంఘం పోరాడుతుంది. అంతే తప్ప మీలాగా నిమిషానికో మాట మాట్లాడటం ఈ సంఘం మనుగడ కాదు.. నిమిషానికో మాట మాట్లాడే మీరు పక్క సంఘాలను విమర్శించడం మానుకోవాలి. - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీఓ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.