ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 14, 2022, 4:58 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • Yanamala: 'వాస్తవ ఆర్థిక పరిస్థితిని చూపకుండా అవాస్తవాలు చెబుతారా ?'
    రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి చూపకుండా అవాస్తవాలు చెబుతారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా నేత యనమల మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో కేంద్రం, రాష్ట్ర ప్రజలను జగన్ సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ-20.. అభిమానుల ఆరోపణల్లో నిజం లేదు !
    విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో T-20కి సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. సమీప ప్రాంతాల్లోని క్రికెట్ అభిమానుల కోసం అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NH-65: ప్రమాదాలకు అడ్డాగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి
    NH-65: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డాగా మారింది. విస్తరణ జరిగి దశాబ్దం అవుతున్నా.. పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రహదారిపై ఏటా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారు. అయినా.. ఎన్‌హెచ్‌ఏఐ, గుత్తేదారు సంస్థ జీఎంఆర్‌ స్పందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పురివిప్పి నెమలి నాట్యం... మనసును దోచే దృశ్యం..!
    Peacock Dance: అడవిలో ఉండే నెమలి రోజూ గ్రామంలోకి వచ్చి నాట్యం చేస్తే చూపరులకు ఎంత ఆనందమో కదా.. అలాంటి దృశ్యమే తెలంగాణలోని మెదక్ జిల్లాలో తరచుగా దర్శనమిస్తోంది. నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఓ మయూరం అప్పుడప్పుడు అడవి నుంచి వచ్చి గ్రామ వీధుల్లో నాట్యం చేసి వెళ్తోంది. తరచు వస్తున్నా ఆ నెమలితో గ్రామస్థులు కాలక్షేపం చేస్తున్నారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంపర్ ఆఫర్.. రూ.54కే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
    అభిమాన నేత పుట్టిన రోజులకు కేక్​లు కట్​ చేయడం, అన్నదానాలు, రక్తదానాలు చేయడం చూశాం. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ రూ.50లక్షల కారణంగానే సోనియా, రాహుల్​కు ఇన్ని చిక్కులు!
    National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి ఈడీ సమన్లు పంపడం.. మరోవైపు రాహుల్ గత రెండు రోజులుగా ఈడీ విచారణకు హాజరవ్వడమే ఇందుకు కారణం. నేషనల్ హెరాల్డ్​ పత్రికలో అవకతవకలు జరిగాయని అధికార భాజపా విమర్శలు కురిపిస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అటువంటిదేమీ లేదని సమర్థించుకుంటోంది. అసలేంటీ నేషనల్ హెరాల్డ్ కేసు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భర్తను చంపడమెలా?' అనే వ్యాసం రాసి.. భర్తను హత్య చేసిన రచయిత
    ఓ రచయిత తన భర్తను కిరాతకంగా కాల్చి చంపింది. ఈ ఘటనకు కొద్ది సంవత్సరాల ముందే ఆ మహిళ 'భర్తను హత్య చేయడం ఎలా?' అనే వ్యాసాన్ని రాసింది. దోషిగా తేలిన మహిళకు.. న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన బిట్​కాయిన్​
    Gold Price Today: బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,290గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,800గా ఉంది. బిట్​కాయిన్​ విలువ ఒక్కరోజే 10 శాతానికిపైగా పతనమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాక్సింగ్ దిగ్గజానికి కుర్రాడి ఛాలెంజ్​.. 'ఆ 50 మంది చేయలేనిది నేను చేస్తా'
    ప్రపంచ బాక్సింగ్​ దిగ్గజం ఫ్లాయిడ్​ మేవెదర్​ మరోసారి బరిలోకి దిగనున్నాడు. జపాన్​కు చెందిన ఎంఎంఏ ఫైటర్​ అసాకురాతో తలపడనున్నాడు. అయితే ఈ మ్యాచ్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఆ మ్యాచ్​ విజయం నాదే అని అసాకురా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అభిమానుల మనసు దోచుకున్న రష్మిక
    Rashmika: రష్మిక చేసిన ఓ పని అభిమానుల మనసు దోచుకుంది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details