తెలంగాణ

telangana

యాదాద్రికి బస్సు సౌకర్యం లేక భక్తుల ఇబ్బందులు - గంటల తరబడి నిరీక్షణ

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 11:07 AM IST

Yadadri Temple Buses Issue : తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేలాది భక్తులు దర్శించుకుంటున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఈ ఆలయంలో సందడి గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. శుక్రవారం రోజున రిపబ్లిక్ డే కావడంతో పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రికి పోటెత్తారు. వారి రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. 

Yadadri Temple Transport Issue : అయితే తిరుగు ప్రయాణంలో సరైన బస్సు సౌకర్యం లేక భక్తులు త్రీవ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉన్న అరకొర బస్సులు ఎక్కేందుకు అంతా పోటీ పడ్డారు. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల కొద్ది నిరీక్షించారు. వృద్ధులు, చంటి పిల్లలు చలికి వణుకుతూ కనిపించారు. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో సహనం కోల్పోయిన భక్తులు బస్టాండ్​లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నుంచి రాత్రి 10 గంటల తరువాత బస్సు సౌకర్యమే లేకపోవడం ఏంటని  ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి చేసేదేం లేక ప్రైవేట్ ట్రావెల్స్ వారు అడిగినంత ఇచ్చి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details