తెలంగాణ

telangana

'రామయ్యా దీవించయ్యా!'- అయోధ్యకు భారీగా భక్తులు- సరయూలో పుణ్యస్నానాలు! - Sriram Navami 2024 Ayodhya

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 7:32 AM IST

Sriram Navami 2024 Ayodhya

Sriram Navami 2024 Ayodhya : శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్ అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. బుధవారం వేకువజామున నుంచే అయోధ్య వీధులు జనసంద్రంగా మారాయి. సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన లక్షలాది మంది భక్తులు, పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. రామయ్యను దర్శనం చేసుకుని పునీతలవుతున్నారు. చాలా ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు.

జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇది తొలి శ్రీరామనవమి. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఇక బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. మూడు నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details