తెలంగాణ

telangana

చిన్నారి లక్షితపై దాడిచేసిన చిరుతను గుర్తించిన అటవీ అధికారులు

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 3:05 PM IST

Identification of Leopard That Attacked Child Lakshitha : తిరుమల అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గతేడాది ఆగస్టు 11వ తేదీన నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెంకు చెందిన భక్తుల బృందం నడక మార్గంలో తిరుమలకు వస్తుండగా చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందింది. లక్షిత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. ఆగస్టు 11న రాత్రంతా బాలిక లక్షిత కోసం గాలించిన పోలీస్ అధికారులకు మరుసటి రోజున బాలిక శవమై కనిపించింది. 

దీంతో కాలిబాటలో వచ్చే భక్తుల రక్షణ కోసం టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాలిక మృతికి ముందు, ఆ తర్వాత అలిపిరి బాటలో ఆరు చిరుతలను బంధించారు. వీటిలో నాల్గవ చిరుత లక్షితపై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించారు. దాడి చేసిన చిరుతను జూ పార్కులో సంరక్షించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details