తెలంగాణ

telangana

కాంగ్రెస్‌కు ఓటు వేయించే బాధ్యత బీసీలు తీసుకోవాలి : వీహెచ్ - V Hanumantha Rao Comments on Modi

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 7:02 PM IST

Congress Leader Hanumantha Rao Emotional Speech : తాను చచ్చే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతురావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు రావాలన్నా, పదోన్నతలు కావాలన్న రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉందని తెలిపారు.

Hanumantha Rao Comments on Modi : ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని హనుమంతరావు ఎద్దేవా చేశారు. మోదీకి ఓటు వేస్తే ఆదాని, అంబానీలకు ఓటు వేసినట్లేనని పున:రుద్ఘాంటించారు. ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అంటోదని తెలిపారు. వారు దేశంలో జీవించలేదా అని ప్రశ్నించారు.  ఈ విషయంలో బడుగు బలహీన వర్గాలు నిశితంగా పరిశీలించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయించే బాధ్యత బీసీలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details