తెలంగాణ

telangana

ఆగి ఉన్న బస్సులో చెలరేగిన మంటలు - తప్పిన పెనుప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:21 PM IST

Bus Fire Accident In Hyderabad : ఈ మధ్య కాలంలో బస్సుల్లో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవించడం చూస్తున్నాం. ఈ ఘటనల్లో భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్​నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన ఆర్.కె.ట్రావెల్స్​కు చెందిన ఓ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

Private Travels Bus Caught Fire in quthbullapur : ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details