తెలంగాణ

telangana

LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్​రెడ్డి మీడియా సమావేశం - Kishan Reddy Live

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 12:12 PM IST

Updated : Apr 15, 2024, 12:45 PM IST

BJP Leader Kishan Reddy Live From State Office : హైదరాబాద్​ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు కూర్చుకున్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు 12వేలు, వరి పంటకు 5 వందల బోనస్, పంట నష్టపోయిన రైతులకు 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రేణులతో కలిసి దీక్ష చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు రైతు దీక్ష కొనసాగనుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా  14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. మోదీ గ్యారంటీ సంకల్ప్ పత్ర పేరుతో విడుదలైన ఈ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ మేనిఫెస్టోపై సీఎం రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ నాయకులు, బీఆర్ఎస్​ నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Last Updated :Apr 15, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details