తెలంగాణ

telangana

వాట్సాప్ నయా కాలింగ్ ఫీచర్​ - నంబర్ లేకున్నా ఫోన్​ చేయొచ్చు! - WhatsApp In App Dialer

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 2:06 PM IST

WhatsApp In-App Dialer : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాట్సాప్ త్వరలో ఇన్​-యాప్​ డైలర్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనితో మీ కాంటాక్ట్ లిస్ట్​లోలేని నంబర్లకు సైతం నేరుగా వాట్సాప్​ నుంచి కాల్ చేయవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

WhatsApp latest features
WhatsApp In-App Dialer

WhatsApp In-App Dialer : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ తమ యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా త్వరలో ఇన్​-యాప్ డైలర్​ను కూడా తీసుకువస్తోంది. అంటే ఇకపై మీరు ట్రూకాలర్​, గూగుల్ డైలర్​ లాంటివి వాడకుండా, నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేయవచ్చు.

ఇప్పటి వరకు వాట్సాప్​ ద్వారా ఎవరికైనా కాల్ చేయాలంటే, ఆ నంబర్​ మన కాంటాక్ట్ లిస్ట్​లో ఉండి తీరాలి. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్​ ఇన్​-యాప్​ డైలర్ అందుబాటులోకి వస్తే, మీ కాంటాక్ట్​ లిస్ట్​లో లేని నంబర్​కు సైతం కాల్ చేయడానికి వీలవుతుంది.

పూర్తిగా సురక్షితం!
ప్రస్తుతానికి వాట్సాప్ ఇన్-యాప్ డైలర్​ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.9.28లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీనిని అందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. చాలా మంది యూజర్లు వాట్సాప్ ద్వారా మాత్రమే ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కాల్స్ చేసేటప్పుడు వాట్సాప్ వాడుతుంటారు. నెట్​వర్క్ ప్రోబ్లమ్ లేకుండా ఉండేందుకు, తక్కువ ఖర్చులో కాల్ చేసేందుకు ఇలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది మరింత భద్రం కానుంది. వాట్సాప్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్నీ ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్షన్ కలిగి ఉంటాయి. కనుక యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని వాట్సాప్​ చెబుతోంది.​

ఇంటర్నెట్ లేకున్నా ఫైల్ షేరింగ్​
ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇకపై నెట్​వర్క్​తో సంబంధం లేకుండా మీ డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు.

సాధారణంగా నెట్‌వర్క్‌ సదుపాయం లేకున్నా బ్లూటూత్‌ సాయంతో షేర్‌ ఇట్‌, నియర్‌ బై షేర్‌ వంటి అప్లికేషన్ల ద్వారా ఫొటోలు, సినిమాలు పంపించుకోవచ్చు. అచ్చం ఆ తరహా సేవల్నే యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఎటువంటి ప్రత్యేక యాప్‌ ఉపయోగించాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లను మరింత వేగంగా సురక్షితంగా పంపేందుకు వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకోవాలంటే వాట్సాప్‌ సిస్టమ్‌ ఫైల్‌, ఫొటోల గ్యాలరీ యాక్సెస్‌ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

కాస్త దగ్గరగా ఉండాల్సిందే!
మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్‌ బ్లూటూత్‌ కనెక్ట్‌ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్​లైన్‌ షేరింగ్​కు వీలవుతుంది. బ్లూటూత్‌ ఆన్‌ చేసి దగ్గర్లోని వాట్సాప్‌ యూజర్‌ పరికరాన్ని గుర్తించి ఫైల్‌ సెండ్‌ చేయాలి. అవతలి వ్యక్తి అనుమతి ఇస్తేనే ఈ తరహా షేరింగ్‌ సాధ్యమవుతుంది. వద్దనుకుంటే ఆఫ్‌ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్​ నయా ఫీచర్​​ - ఇంటర్నెట్ లేకున్నా ఫైల్స్​​ షేర్ చేయొచ్చు! - Upcoming WhatsApp Feature

మీ ల్యాప్​టాప్​ 'బ్యాటరీ హెల్త్' చెక్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check Laptop Battery Health

ABOUT THE AUTHOR

...view details