ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మా చెరువు మిస్సింగ్​ - వెతికి పెట్టండి ప్లీజ్​' - పోలీసులకు ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 4:54 PM IST

Updated : Feb 26, 2024, 6:47 PM IST

YCP MLA Occupied 100 Acre Pond: స్థలం ఖాళీగా ఉంటే గుట్టుచప్పుడు కాకుండా అధికారులను అడ్డం పెట్టుకుని మింగేయడం, అధికారంలో ఉండగానే అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంతో వైసీపీ నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలోని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట చెరువును కబ్జా చేశారని రాష్ట్ర ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

ycp_mla_occupied_pond
ycp_mla_occupied_pond

'మా చెరువు మిస్సింగ్​ - వెతికి పెట్టండి ప్లీజ్​' - పోలీసులకు ఫిర్యాదు

YCP MLA Occupied 100 Acre Pond:మన ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా శిక్షించాలని, ఎక్కడా అన్యాయం జరగదని సీఎం జగన్ మహా గొప్పగా చెప్తుంటారు. కానీ ఇవేమీ అధికార పార్టీ నాయకులకు వర్తించనట్లు వ్యవహరిస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, ప్రభుత్వ స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా అధికారులను అడ్డం పెట్టుకుని మింగేయడం, అధికారంలో ఉండగానే అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దోపిడీకి తెగబడుతున్నారు. పార్కులు, అత్యంత విలువైన కూడలిలోని స్థలాలు, బళ్లూ, ఆలయ స్థలాలు, చెరువులు అనే తేడా లేకుందా అందిన కాడికి దోచుకుంటున్నారు.

రెవెన్యూ అధికారులను బుట్టలో వేసుకుని దొంగపత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. వారి అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫలితంగా కోట్లు విలువ చేసే స్థలాలు అధికార పార్టీ నేతల పరమవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట చెరువును కబ్జా చేసి తన విలాసాలకు వాడుకుంటున్నారని రాష్ట్ర ఓబీసీ పోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆరోపించారు.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు 100 ఎకరాల చెరువు కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి ఎంఆర్​ పల్లి పోలీస్ స్టేషన్ వరకు 'చెరువు చెరువు ఎక్కడున్నావ్, చెరువు మిస్సింగ్' అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ. 100 కోట్ల నిధులు ఆ చెరువులో ఖర్చు చేశారని ఆరోపించారు.

ఖాళీ స్థలమా కాజేసేయ్! - గద్దలా వాలిపోతున్న వైసీపీ నేతలు

చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయిందని పేరూరు చెరువు, స్వర్ణముఖి నుంచి పిల్ల కాలువలు ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని అన్నారు. ఈ నీటితో తుమ్మలగుంట పరిసర ప్రాంతాల్లో 180 ఎకరాల ఆయకట్టుతో పొలాలలో పంటలు పండేవని, గ్రామాలలో త్రాగునీరు పుష్కలంగా ఉండేవని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి పోయి తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచెత్తుతుందని గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని అన్నారు.

వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో భూకబ్జాలు - మౌనముద్ర వహించిన అధికారులు

మొన్ననే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తుమ్మలగుంట చెరువుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. కనుమరుగైన చెరువును వెతికిపెట్టమని ఆర్డీవోకి, పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. తుమ్మలగుంట చెరువును కాపాడుకోవడానికి ఎంతటి పోరాటకైనా సిద్దంగా ఉన్నానాని సుధా యాదవ్ చెప్పారు. సంబంధిత అధికారులు 48 గంటల్లో స్పందించాలని లేనిపక్షంలో మరో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తానని అధికారులను సుధా యాదవ్ హెచ్చరించారు.

Last Updated :Feb 26, 2024, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details