తెలంగాణ

telangana

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - Family Suicide in Kadapa

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 2:40 PM IST

Family Committed Suicide in Kadapa : ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు ఉరేసిన తల్లి అనంతరం తానూ సూసైడ్ చేసుకుంది.

Family Suicide in Kadapa
Family Committed Suicide in Kadapa

Family Suicide in Kadapa :ఏపీలోనివైఎస్సార్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. వల్లూరు సమీపంలోని పొలంలో చెట్టుకు కుమారుడు ఫణికుమార్ (18), కుమార్తె ధనలక్ష్మి (17)కి ఉరేసిన తల్లి ఉమామహేశ్వరి (40) అనంతరం తానూ సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో ఉమామహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆదివారం రాత్రి భర్తతో ఇంట్లో గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి చావుకు భర్త, అత్త, ఆడపడుచు కారణమని సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details