తెలంగాణ

telangana

నల్గొండ దేవాదాయ భూములపై రియల్ ఎస్టేట్​ పంజా - అధికారులకు సైతం పట్టని భూ ఆక్రమణలు

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 9:37 PM IST

Temple Lands Under Encroachment in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వకాలంలో ఆయా దేవునికి నిత్య పూజలు, దూప, దీప నైవేద్యం కోసం దాతలు భూమిని విరాళంగా ఇచ్చారు. వేలాది ఎకరాలు ఉన్న ఆ భూములు, నేడు భూకబ్జాదారులు ఆక్రమించుకుని కోట్లు సంపాదిస్తున్నారు. కొన్ని దేవాలయాలను కనిపించకుండా చేసి కైవసం చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వేలకు పైగా ఉన్న దేవాలయాల్లోని భూములు కాపాడాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నా అధికారుల నుంచి స్పందన కరవైంది.

Temple Lands Kabja in Nalgonda
Temple Lands Under Encroachment in Nalgonda

Temple Lands Under Encroachment in Nalgonda :ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వేలకు పైగా ఆలయాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన భూములను అనేక మంది భూకబ్జాదారులు(Land Grabbers) ఆక్రమించారు. దేవాలయ భూముల్లో ఏడు వేల ఎకరాలు సాగుకు యోగ్యమైనవి ఉండగా కేవలం 2800 ఎకరాల భూములను మాత్రమే లీజుకిస్తున్నారు. మిగిలిన భూములు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఏటా ఉత్సవాలు జరుపుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో దేవాలయాలు కాలగర్భంలో కలిసే అవకాశం లేకపోలేదు.

Temple land acquisition in Wanaparthy : ప్రభుత్వ భూములు సగం దేవాలయానికి.. మరో సగం స్వాహా

నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్డులో బ్రహ్మంగారి గుడికి చెందిన 12 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. ఆక్రమించడమే కాకుండా వాటిని నివాస స్థలాలుగా మార్చుకొని రిజిస్టర్ చేశారు. రెవెన్యూ, రిజిస్టర్(Revenue, Register ), దేవాదాయశాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డులను మార్చి రిజిస్టర్‌ చేసుకున్నా, అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో భక్తులు ఫిర్యాదు కూడా చేశారు. భూమిని స్వాధీనం చేసుకొని రికార్డులను అందజేయడంతో, ట్రిబ్యునల్ విచారణ జరిపి అది దేవాలయ భూమిగా నిర్ధారించింది. దీంతో సమస్య సద్దుమణిగిన భూమిని మాత్రం స్వాధీనం చేసుకోలేదు.

"దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఉన్న వందల ఎకరాలు భూములు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అందులోనూ నల్గొండ జిల్లా చూసుకుంటే బ్రహ్మం గారి గుట్ట, కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయానికి వందల ఎకరాల భూమి ఉంది. దానిపై గత పదిహేను సంవత్సరాలు క్రితం ఒక రియల్​ ఎస్టేట్​ వ్యాపారి వాటిని ప్లాట్​లుగా వేసుకొని అమ్ముకున్నా సరే, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కోర్టు నుంచి తీర్మానం వచ్చినా కూడా దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది."-జెల్లెల గోవర్ధన్, రాష్ట్రీయ శ్రీరాంసేన అధ్యక్షుడు

Temple Land Issue in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములపై హైకోర్టు, దేవాలయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్స్​ రెవెన్యూ కోర్టులో 1939 కేసులపై విచారణ సాగుతోంది. దేవాలయ క్రిమినల్​లో 83 కేసులు ఉండగా, రెవెన్యూ ట్రిబ్యునల్​(Revenue Tribunal)లో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేవాదయ శాఖ ట్రిబ్యునల్ తీర్పులో భూములు ఆలయానికి చెందినవేని తేల్చిన కూడా తదుపరి చర్యలు మాత్రం శూన్యమయ్యాయి. సరైన ఆధారాలు ఉంటే తప్ప చర్యలు తీసుకోలేమని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

"నల్గొండ జిల్లాలో దేవాదాయ భూములు మొత్తం 2,943 ఎకరాలు ఉంది. అదేవిధంగా 7,332 ఎకరాల భూమి సూర్యాపేటలో, 2437 ఎకరాలు యాదాద్రి భువనగిరిలో ఉన్నాయి. ఆ భూములను బయటకు లీజుకు ఇచ్చి, రెవెన్యూ కలెక్ట్​ చేస్తున్నాం. వీటిలో కొన్ని కబ్జాకు గురైయ్యాయి. వాటిమీద రెవెన్యూ కోర్టు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవన్నీ కూడా కోర్టు తీర్పుననుసరించి, తిరిగి స్వాధీనపరుచుకుంటాం."-మహేందర్ కుమార్, దేవాదాయ సహాయ కమిషనర్

రాత్రికి రాత్రే చెరువు మాయం- ఊరి జనమంతా షాక్- ఎక్కడంటే?

లీజు భూములపై రాష్ట్ర ప్రభుత్వం నజర్‌ - రాబడుల పెంపు దిశగా అడుగులు

ABOUT THE AUTHOR

...view details