తెలంగాణ

telangana

పదో తరగతి విద్యార్థులకు​ అలర్ట్ - రిజల్ట్స్‌ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే? - TS SSC Results 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 1:13 PM IST

Telangana 10th Results 2024 On April 30 : తెలంగాణలో పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

TS SSC RESULTS 2024 updates
TS SSC RESULTS 2024 updates

Telangana SSC Results 2024 :తెలంగాణలో ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫలితాల ప్రకటనకు ముహూర్తం సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను వెల్లడించనున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించారు. 5,08,385 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మూల్యాంకనం గత శనివారం పూర్తయింది.

TS SSC Board Results 2024 :ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు ఫలితాల డీ-కోడింగ్‌ అనంతరం ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనుంది. ఇందుకోసం విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం అనుమతితో ఇవాళ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇక మిగిలింది పదో తరగతి ఫలితాలు మాత్రమే. మరోవైపు ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యాశాఖ మొత్తం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం లోనికి అనుమతించారు.

టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​! - India Army Jobs

రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. 30,000ల మంది వరకు ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపుపదోతరగతి పరీక్షల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ సైతం విద్యార్థులు పరీక్షలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాలురు తమ హాల్ టికెట్ చూపించి జనరల్ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణం చేసేలా వీలును కల్పించింది. బాలికలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సర్వీసు అందుబాటులో ఉంది.

నావల్ డాక్​యార్డ్​లో 301 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Naval Dockyard Apprentice Posts

ఇంటర్​ ఫలితాలు 2024​ విడుదల - రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి - TS INTER RESULTS RELEASED 2024

ABOUT THE AUTHOR

...view details