తెలంగాణ

telangana

మరో పదిరోజుల్లో వివాహం - అంతలోనే యువతి ఆత్మహత్య

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 7:22 PM IST

Software Employee Committed Suicide in Gachibowli : మరికొన్ని గంటల్లో కాబోయే భర్తతో ఫ్రీ వెడ్డింగ్​ షూట్​ అంతలోనే ఆ యువతి హాస్టల్​ గదిలోని బాత్​రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Committed Suicide
Software Employee Committed Suicide

Software Employee Committed Suicide in Gachibowli : మరో పది రోజుల్లో పెళ్లి, గురువారం కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్​ షూట్​కు వెళ్లాలి కానీ ఇంతలోనే ఓ విషాదకరమైన ఘటన జరిగింది. బాత్​ రూంలో ఉరివేసుకొని సాప్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గోస్కుల పల్లికి చెందిన ముదాం విద్యశ్రీ(23) అనే యువతి గచ్చిబౌలిలోని కొత్తగూడలో ఉన్న పీజీ లేడీస్​ హాస్టల్(PG Ladies Hostel)​లో ఉంటుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో యువతి సాప్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తుంది. సోమవారం విధులకు వెళ్లకుండా హాస్టల్​లో ఉంటూ ఆమె సాయంత్రం 4 గంటల సమయంలో బాత్​రూంలో షవర్​ రాడ్​కు టవల్​తో ఉరివేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన హాస్టల్​ సిబ్బంది తనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది.

జ్యోతిషం నమ్మొద్దన్నందుకు ఒకరు, చట్నీ ఎక్కువగా వేశావన్నందుకు మరొకరి ఆత్మహత్య

ఈ నెల 17వ తేదీన యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. తన వివాహం ఉండటంతో తన హాస్టల్​ రూమ్​మేట్స్​కు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలను పంచి, తప్పక రావాలని ఆహ్వానించింది. అయితే గురువారం కాబోయే భర్తతో ఫ్రీ వెడ్డింగ్​ షూట్(Free Wedding Shoot)​కు వెళ్లాలి. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ హాస్టల్​లోని బాత్​రూంలో సోమవారం షవర్​ రాడ్​కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది.

Gachibowli Software Employee Suicide in Hyderabad : అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు పది రోజుల్లో అత్తారింటికి వెళ్లాల్సిన కుమార్తె ఇలా విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలా సూసైడ్​ చేసుకుంటున్నారో ఎవరికి అంతుపట్టడం లేదు. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పి సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

భార్య ఆత్మహత్య కేసు- 30ఏళ్లకు భర్తను నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం

భార్య ఆత్మహత్య - భయంతో భర్త బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details