తెలంగాణ

telangana

అవన్నీ అసత్యకథనాలే- మాయవతి ట్వీట్‌పై ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందన

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 9:08 AM IST

RS Praveen Kumar on Mayawati Tweet : బీఎస్పీ పొత్తులపై జరుగుతున్న ప్రచారంపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు. పార్టీ అధినేత్రి మాయవతి చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, తప్పుడు ఊహాగానాలు చేయటం సరికాదన్నారు. తాము ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఎన్డీఏ, ఇండియా కూటముల్లోనూ ఉండబోమని గతంలో చాలాసార్లు తమ నాయకురాలు స్పష్టం చేసినట్లు తెలిపారు.

BSP Mayawati Tweet
RS Praveen Kumar on Mayawati Tweet

RS Praveen Kumar on Mayawati Tweet :బీఎస్పీ అధినేత్రి మాయవతి ట్వీట్‌పై జరుగుతున్న ఊహాగానాలపై, తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు. తాము ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, పార్టీ అధినేత్రి మాయవతి ట్వీట్​పై మీడియాలో వస్తున్న కథనాలల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. మాయవతి చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, తప్పుడు ఊహాగానాలు చేయటం సరికాదన్నారు.

తాము ఏ జాతీయ పార్టీతో కలవడంలేదని, ఎన్డీఏ, ఇండియా కూటముల్లోనూ ఉండబోమని గతంలో చాలాసార్లు తమ నాయకురాలు స్పష్టం చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 'తృతీయ ఫ్రంట్' అని వస్తున్న కథనాల్లోనూ నిజం లేదని చెప్పారు. యూపీలోనూ ఒంటరిగా పోటీ చేస్తామని మాయవతి చెప్పారని, అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో కలసి పనిచేయడం గురించి ఆమె ప్రస్తావించలేదని ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ తెలిపారు.

గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్టుగానే, తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కోసం ఇటీవల జరిగిన చర్చలకు తమ పార్టీ నాయకత్వం అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతాయని ఆర్ఎస్. ప్రవీణ్‌ స్పష్టం చేశారు.

BSP Mayawati Tweet :అసలేం జరిగిందంటే.. రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయవతి(BSP Mayawati) స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. బీఎస్పీ పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతుందని ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల కూటమి, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వదంతులు వ్యాప్తి చేయడం స్థూలమైన, తప్పుడు వార్తలు అని కొట్టి పడేశారు. ఇలాంటి అబద్దపు వార్తలు ప్రచురించి మీడియా తన విశ్వసనీయత కోల్పోకూడదని హితవు పలికారు. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి యూపీలో ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా అశాంతికి గురవుతున్నాయని అన్నారు.

గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్​రెడ్డికి ప్రవీణ్​కుమార్​ లేఖ

అందుకే ప్రతిపక్షాలు రోజూ రకరకాల వదంతులు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాయవతి ఆక్షేపించారు. అయితే బహుజన వర్గాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. "ఎక్స్‌"లో మాయావతి చేసిన పోస్టును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రీపోస్టు చేశారు.

దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలనే బీఆర్​ఎస్​తో పొత్తు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్​ఎస్​తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'

ABOUT THE AUTHOR

...view details