తెలంగాణ

telangana

గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌‌‌‌ఎంపీ - వైద్యం వికటించి యువకుడు మృతి - Young Man died due to RMP Treatment

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 10:41 PM IST

Young Man died due to RMP Medical Malpractice : జ్వరంతో వచ్చిన యువకుడికి ఓ ఆర్‌‌‌‌ఎంపీ గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇచ్చిన నిర్వాకంతో అతడి పరిస్థితి విషమంగా మారి, చనిపోయిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వచ్చీ రాని వైద్యం చేయడంతో తన భర్త చనిపోయాడని బాధితుని భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ శ్రీనివాస్ ఆసుపత్రి కట్టేసి పరారు కాగా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Young Man died due to RMP Given 7 injections within Hour
Young Man died due to RMP Medical Malpractice

Young Man died due to RMP Given 7 injections within Hour :వరంగల్ జిల్లాలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా గంట వ్యవధిలో ఏడు ఇంజక్షన్లు వేయడంతో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు వాపోయారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌‌‌‌ఎంపీ : ఇటీవల తీవ్ర జ్వరం, నీరసంతో నవీన్‌ బాధపడుతుండగా, అతడి భార్య మేఘన ఫిరంగిగడ్డలో ఉన్న ఆర్ఎంపీ ఆడెపు శ్రీనివాస్‌ను సంప్రదించారు. వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే జ్వరం తగ్గడానికి రెండు ఇంజక్షన్లు మొదటగా వేశాడు. ఆ తర్వాత రెండు గ్లూకోజ్‌లు పెట్టాడు. దీంతో బాధితుడు తీవ్ర చలికి లోనై వణుకుతుండడంతో గంట వ్యవధిలో వరుసగా ఏడు ఇంజక్షన్లు చేయడంతో అతని పరిస్థితి విషమించింది.

ఆర్‌‌‌‌ఎంపీ వైద్యం వికటించి యువకుడు మృతి : ఇది గమనించిన కుటుంబ సభ్యులు సదరు ఆర్ఎంపీని నిలదీయడంతో అతను భయపడి వెంటనే నవీన్‌ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించి, అక్కడి నుంచి పంపించేశాడు. కుటుంబ సభ్యులు నవీన్‌ను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆపై హైదరాబాద్‌కు వైద్యనిమిత్తం తరలించే క్రమంలో మృతి చెందాడు. ఆర్ఎంపీ నిర్లక్ష్యపు వైద్యం వల్లే తన భర్త చనిపోయాడని బాధితుని భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్యుడు శ్రీనివాస్ ఆసుపత్రి కట్టేసి పరారు కాగా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నవీన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జ్వరం వచ్చిందని తీసుకెళ్లిన తన అన్నకు ఏవేవో ఇంజక్షన్లు ఇచ్చి తన అన్న మృతికి కారకుడైన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మృతుడి సోదరి విజ్ఞప్తి చేయగా, నవీన్ మృతితో వర్ధన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

"ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆర్​ఎంపీ మా అన్నకు​ రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. ట్యాబ్లెట్స్​ ఇవ్వగా, మా అన్న వేసుకున్నారు. అప్పటికీ కొంచెం వేడీ తగ్గింది. కొంచెం చెమటలు వచ్చాయి. దీంతో వద్దు రేపు ప్రభుత్వ ఆసుపత్రులో చూయించుకుంటామని డాక్టర్​కు చెప్పాం. అయినా వినకుండా నాలుగు సెలైన్​ బాటిళ్లు పెట్టారు. రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. మా అన్నను చంపారు"- రవళి, మృతుడి సోదరి

గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌‌‌‌ఎంపీ - వైద్యం వికటించి యువకుడు మృతి

Self Treatment For Diarrhoea : 10 కర్పూరం బిళ్లలు మింగేసిన యువకుడు.. వికటించిన 'యూట్యూబ్'​ వైద్యం.. ఆస్పత్రిలో..

woman died at Pargi : మహిళకు ఆర్​ఎంపీ ఇంజెక్షన్.. వైద్యం వికటించి మృతి!

ABOUT THE AUTHOR

...view details