తెలంగాణ

telangana

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు - షెడ్యూల్ ఇదే

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 2:41 PM IST

PM Modi Telangana Tour Schedule : ప్రధాన మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. శుక్రవారం, శనివారం ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించి పార్టీ శ్రేణుల్లో జోష్​ నింపనున్నారు.

PM Modi
PM Modi

PM Modi Telangana Tour Schedule : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు రేపు సాయంత్రం 4:50 గంటలకు ప్రధాని చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజ్‌గిరికి వెళ్లనున్నారు. సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 గంటల వరకు మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు 1.2 కిలోమీటర్లు మోదీ రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్‌షో అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకోనున్న ఆయన రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

శనివారం ఉదయం 10:45 గంటలకు రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ (PM Modi) అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 12:45 వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని ఒంటి గంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్‌లో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ

ఈ నెల 18న మరోమారు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. జగిత్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లోనూ ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటించారు. అధికారిక కార్యక్రమాలతో పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదిలాబాద్, సంగారెడ్డిలో నిర్వహించిన విజయ సంకల్ప సభల్లో మోదీ పాల్గొన్నారు. మళ్లీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని పర్యటన ఖరారైంది. ఒక్క నెలలోనే నరేంద్ర మోదీ ఐదు సార్లు తెలంగాణలో పర్యటిస్తుండటంతో కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఇదే :

  • శుక్రవారం సాయంత్రం బేగంపేట చేరుకోనున్న ప్రధాని మోదీ
  • మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు రోడ్‌షోలో పాల్గొనున్న మోదీ
  • రోడ్‌షో అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకోనున్న ప్రధాని
  • శనివారం రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు వెళ్లనున్న మోదీ
  • శనివారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
  • నాగర్‌కర్నూల్ సభ అనంతరం హెలికాప్టర్‌లో కర్ణాటకకు వెళ్లనున్న మోదీ

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

'బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాదిగ విరోధులు - మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా'

ABOUT THE AUTHOR

...view details