తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 4కు వాయిదా - MLC Kavitha Bail Petition Adjourned

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 4:32 PM IST

MLC Kavitha Bail Petition Adjourned : దిల్లీ మద్యం స్కాం కేసులో, కవిత బెయిల్ పిటిషన్​పై విచారణ ఈనెల 4కు వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం లంచ్‌ విరామం తర్వాత వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16వరకు బెయిల్ మంజూరు చేయాలని, గత నెల 26న ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

MLC kavitha Bail Petition
MLC Kavitha in Delhi Liquor Scam

MLC Kavitha Bail Petition Adjourned :దిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 4కు వాయిదా పడింది. సుదీర్ఘ వాదనలు అనంతరం, ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేసేందుకు కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సమయం కోరారు. ఈ మేరకు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.

కవిత అరెస్టుతో నిజామాబాద్‌ బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం - సమన్వయం చేసే వారు లేకపోవడంతో అయోమయం - Lok Sabha Elections 2024

తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16వరకు బెయిల్ మంజూరు చేయాలని, గత నెల 26న ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్​పై సమాధానం చెప్పాలని, రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​కు(ED Investigation) నోటీసులు జారీచేసింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియటంతో అదేరోజు రౌస్​ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరుపరిచారు.

Kavitha Delhi Liquor Scam Update :కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నందున 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని కోర్టుకు వెల్లడించిన ఆమె తరఫు న్యాయవాది, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుండగా ఆమెను తిహాడ్ జైలుకు అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలోనే కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్(Interim Bail) పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈడీ కౌంటర్‌కు ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణ ఏప్రిల్ 4న మధ్యాహ్నం రెండున్నరకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

MLC Kavitha Arrest Impact in BRS Party : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కేసులో అరెస్టు కావడం నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఇందూరు పార్లమెంట్​ స్థానంపై పట్టు, గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె అనుభవం భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు కలిసి వస్తుందని భావించారు. కానీ కవిత అరెస్టుతో జిల్లాలోని గులాబీ శ్రేణులు(BRS Leaders) నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్తుండగా లోక్​సభ నియోజకవర్గ పరిధిలో పార్టీని సమన్వయం చేసే పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది.

రాత్రి అన్నంలో పప్పు, ఉదయం చాయ్​తో స్నాక్స్ - తీహాడ్ జైలులో కవిత మొదటి రోజు మెను! - BRS Leader Kavitha At Tihar Jail

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - Delhi liquor scam updates

ABOUT THE AUTHOR

...view details