తెలంగాణ

telangana

'బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలన్నీ నాకు తెలుసు - త్వరలోనే బయటపెడతా'

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 1:06 PM IST

MLA Veeresham Fires On BRS Party : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించారు. అనంతరం బీఆర్ఎస్ గత పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Telangana Assembly Sessions 2024
MLA Veeresham Fires On BRS Party

MLA Veeresham Fires On BRS Party :గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ఎమ్మెల్యే వీరేశం ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తనకు తెలుసని, పార్టీలో అవమానాలకు గురైనందువల్లే కాంగ్రెస్​లోకి వచ్చానని తెలిపారు. గత ప్రభుత్వం పాలననో ప్రగతి భవన్ ప్రజలకు దూరమైందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ గోడలు బద్దలుకొట్టామని చెప్పారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదన్నారు. కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో దళితుల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.

ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం - అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన

'దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసింది. దళితబంధు పేరుతో బీఆర్ఎస్ నేతలు దళితులను మభ్యపెట్టారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, పాలమూరు ప్రజలు బీఆర్ఎస్​ను దూరం పెట్టారు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని బీఆర్ఎస్ నేతలను కోరుతున్నా' అని వీరేశం అన్నారు.

Telangana Assembly Sessions 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాతమని తెలిపారు. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని ఆరోపించారు. ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మిగతా రెండు గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పదేళ్లుగా జరిగిన అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వీరేశం అన్నారు.

ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం

"అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. గ్రామాల్లో బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. నల్గొండ జిల్లాలో పదేళ్లుగా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించారు. పదేళ్లుగా అన్ని రంగాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమకారులంటే గత ప్రభుత్వానికి గౌరవం లేదు. గత ప్రభుత్వం గద్దర్‌ను కూడా ఘోరంగా అవమానించింది. మేం వచ్చాక గద్దర్ జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నాం. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవు. గురుకుల పాఠశాలల్లో 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి." - వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ నాకు తెలుసు వీరేశం

బీఆర్ఎస్ పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రైవేటు వర్సిటీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదని దుయ్యబట్టిన ఆయన, శ్రీకాంతాచారి తల్లిని కూడా ఘోరంగా అవమానించారని మండిపడ్డారు.

అసెంబ్లీకి రాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా? - కేసీఆర్​పై కాంగ్రెస్ నేతల ఫైర్

కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం - ఆ 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం 'ఆకర్ష్' వ్యూహం!

ABOUT THE AUTHOR

...view details