తెలంగాణ

telangana

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా : మంత్రి పొన్నం

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 3:58 PM IST

Minister Ponnam Fires on BRS MLC Kavitha : పూలే విగ్రహం పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా అంటూ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాతనే కవిత సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు.

Etv Bharat
Minister Ponnam Fires on BRS MLC Kavitha

Minister Ponnam Fires on BRS MLC Kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న కవిత డిమాండ్​ను మరోసారి తప్పుపట్టారు. బీఆర్‌ఎస్‌(BRS) పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా అంటూ ధ్వజమెత్తారు. గులాబీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కవిత మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకొని మాట్లాడాలన్నారు.

త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతాం : సీఎం రేవంత్

Minister Ponnam on Caste Census in Telangana :కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టుందని అందుకే కొత్త నినాదం ఎత్తుకుందని మంత్రి పొన్నం(Minister Ponnam) ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. కులగణన(Caste Census) చేస్తామని మాట ఇచ్చామని, చేస్తున్నామన్న మంత్రి, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం మేధావి వర్గం నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.

అసలేం జరిగిందంటే..అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన భారత్ జాగృతి సదస్సులో దీనిపై తీర్మానం కూడా చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. పూలే జయంతి అయిన ఏప్రిల్ 11వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని తీర్మానంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాలు, ప్రొఫెసర్లు, తదితరులు హాజరయ్యారు. ఈ డిమాండ్​ను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కొట్టిపారేస్తోంది. అధికారంలో లేనప్పుడు లేని అభిమానం ఇప్పుడెలా వచ్చిందని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్​ఎస్​ నాయకులు భయపడుతున్నారు : పొన్నం

"పూలే విగ్రహం పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాజకీయం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో గుర్తుకు రాలేదా?, బీఆర్‌ఎస్‌ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన తర్వాతనే కవిత సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి. కవిత లిక్కర్ కేసులో బిజీగా లేనట్టుంది. అందుకే కొత్త నినాదం ఎత్తుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకుని మాట్లాడాలి". - పొన్నం ప్రభాకర్‌, మంత్రి

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఫూలే గుర్తుకు రాలేదా మంత్రి పొన్నం

గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం : మంత్రి పొన్నం

ABOUT THE AUTHOR

...view details