తెలంగాణ

telangana

సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై బీఎస్పీ అధినేత్రి క్లారిటీ - అంతర్మథనంలో రాష్ట్ర నాయకత్వం

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 9:13 PM IST

Mayawathi Clarity On Alliances : బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి మాయవతి లోక్​సభ ఎన్నికల్లో పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతుందని సంచలన ప్రకటన చేశారు. మూడో ఫ్రంట్​ ఏర్పాటు గురించి పుకార్లు వ్యాప్తి చేయడం, తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. ఈ మేరకు మాయవతి ఎక్స్​ వేదికగా స్పందించారు.

Mayawathi Clarity On Alliances
Mayawathi Clarity On Alliances

Mayawathi Clarity On Alliances :బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Former CM Of Uttar Pradesh Mayawati) సంచలన ప్రకటన చేశారు. దేశంలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ (బహుజన్​ సమాజ్​ పార్టీ) పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతోందని ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల కూటమి, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి పుకార్లు వ్యాప్తి చేయడం స్థూలమైన, తప్పుడు వార్తలు అని కొట్టి పడేశారు. ఈ మేరకు ఆమె "ఎక్స్‌" వేదికగా స్పందించారు. ఇలాంటి అబద్దపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయత కోల్పోకూడదని హితవు పలికారు. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి యూపీలో ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా అశాంతికి గురవుతున్నాయని అన్నారు.

గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్​రెడ్డికి ప్రవీణ్​కుమార్​ లేఖ

Former CM Of Uttar Pradesh Mayawati Announcement :అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని ఆక్షేపించారు. అయితే బహుజన వర్గాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. "ఎక్స్‌"లో మాయావతి చేసిన పోస్టును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) రీపోస్టు చేశారు.రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్​ఎస్​, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాయావతి చేసిన ప్రకటనపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతర్మథనంలో పడిపోయింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆర్‌ఎస్పీ సమాలోచనలు జరిపారు.

'సిర్పూర్ వాసులు నన్ను దత్తత తీసుకున్నారు'

Former CM Of Uttar Pradesh :తెలంగాణలో తాజా పొత్తుల అంశంపై ఆ పార్టీ అధినేత్రి, కేంద్ర నాయకత్వానికి నివేదిక పంపించారు. అధిష్టానం నుంచి సమాచారం వచ్చిన తర్వాత రాత్రి పొద్దుపోయే సమయానికి మాయావతి ప్రకటన, బీఆర్​ఎస్​తో పొత్తుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని బీఎస్పీ (BSP) వర్గాలు తెలిపాయి. అధినేత్రి "ఎక్స్‌" వేదికగా చేసిన ప్రకటనే అంతిమ నిర్ణయమైతే మాత్రం రాష్ట్రంలో తాజా పొత్తుల అంశం ఇక ముగిసిన అధ్యాయం అన్నట్లు విశ్వసనీయ సమాచారం.

RS Praveen Kumar Tweet about BRS BSP Alliance : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్​ఎస్​ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఇటీవల పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పాటునకు అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో రాజ్యాంగం, లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పు దృష్టిలో ఉంచుకొని బహుజన సాధికారత - రక్షణ - భవిష్యత్తు వంటి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు.

'సార్వత్రిక సమరంలో ఒంటరి పోరు- ఎన్నికల తర్వాత పొత్తు'- రిటైర్మెంట్​పై మాయావతి క్లారిటీ

గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్​రెడ్డికి ప్రవీణ్​కుమార్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details