తెలంగాణ

telangana

ఎలక్ట్రిక్‌ ట్రాలీ డిజైన్ చేసిన హనుమకొండ వాసి - అసలు కారణం అదేనట - electric trolley in hanamkonda

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 7:59 AM IST

Hanamkonda Man Designed Electric Trolley : పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం భరించలేక వినూత్నంగా ఆలోచించి ఎలక్ట్రికల్‌ ట్రాలీని తయారు చేశాడు హనుమకొండకు చెందిన మహిపాల్‌చారి. ఏవైనా ట్రాన్స్‌పోర్ట్‌ చేయాలంటే అధికంగా ఖర్చవుతుందని, అందుకే దీనిని తయారు చేసినట్లు తెలిపారు.

Electric Trolley
Man From Hanamkonda Invented Electric Trolley

ఎలక్ట్రిక్‌ ట్రాలీని కనుగొన్న హనుమకొండ వాసి అసలు కారణం అదేనట!

Hanamkonda Man Designed Electric Trolley :పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం భరించలేక వినూత్నంగా ఆలోచించాడు హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మహిపాల్‌చారి. విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రికల్ ట్రాలీని తయారుచేశాడు. వెల్డింగ్‌ పనిచేసే మహిపాల్‌ గతంలో వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తయారుచేసి రాష్ట్రపతి చేతులు మీదగా పురస్కారం అందుకున్నాడు.

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేటకు చెందిన కడివెండి మహిపాల్‌ ఎలక్ట్రికల్‌ ట్రాలీ ఆటోను తయారు చేశాడు. రైతులు, చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే తపనతో ఈ వాహనాన్ని రూపొందించాడు. రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతో ఉపయోగపడుతోంది.

బీవీఆర్​ఐటీలో ఈ-రేసింగ్​ పోటీలు- వాహనతయారీలో టాప్​గేర్​లో​ దూసుకుపోతున్న విద్యార్థులు

"నాకు ట్రాన్స్‌పోర్టు ఉంది. అక్కడి నుంచి నేను ఉండే స్థలానికి ఏదీ పంపించాలి అన్నా ఆటో కావాలి. ఆటో వాళ్లు సమయానికి రారు, వచ్చినా చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఏదైనా తయారు చేయాలి అనుకున్నాను. ట్రాలీ లాంటిది తయారు చేస్తే ఏదైనా ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనుకుని ఇది చేశాను. నాలుగు గంటలు ఛార్జ్‌ చేస్తే 70 నుంచి 80 కిలో మీటర్ల వరకు పోతుంది. సుమారు 500 కేజీల బరువును ఇది మోస్తుంది." -మహిపాల్‌ చారి, పరకాల

చిన్న ట్రాలీ, మూడు టైర్లు, 4 బ్యాటరీలు, వెయ్యి వాట్ల మోటారు ఉపయోగించి.వాహనాన్ని తీర్చిదిద్దినట్లు మహిపాల్‌ తెలిపాడు. డ్రైవర్ పక్కన మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు కల్పించినట్లు వివరించాడు. ఎలక్ట్రిక్‌ ట్రాలీ వాహనాలు కావలసినవారు తనను సంప్రదిస్తే వారంలో తయారుచేసి ఇస్తానని, రెండేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్‌ చేస్తానని మహిపాల్‌ చెబుతున్నారు.

Electric Vehicles Demand :కాగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. పెరుగుతున్న ఇంధనాల రేట్ల దృష్యా అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనడాన్ని వన్‌ టైం ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు నేటి ప్రజలు. ఇప్పుడు వివిధ కంపెనీలు వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. మ్యాప్స్‌ ఇలాంటి అప్షన్స్‌ను వాహనాల్లో ఉంచుతున్నాయి. చార్జింగ్‌ పెట్టుకోవడానికి దగ్గర్లో ఉన్న చార్టింజ్‌ పాయింట్లను కూడా మ్యాప్‌లో చూపిస్తాయి. రానురాను వినియోగదారుల అవసరాల దృష్యా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కొత్త మెలుకువలే తీసుకొస్తున్నారు వ్యాపారులు.

తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ రేసింగ్‌ కారును తయారు చేసిన విద్యార్థులు- విశేషాలు ఇవే!

హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారు రూపొందించిన రాకేష్‌ - సింగిల్​ ఛార్జ్​ చేస్తే 300 కి.మీ.

ABOUT THE AUTHOR

...view details