ETV Bharat / state

హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారు రూపొందించిన రాకేష్‌ - సింగిల్​ ఛార్జ్​ చేస్తే 300 కి.మీ.

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 3:05 PM IST

Hybrid Electric Car Designed By Rakesh In Khammam : కాలుష్య రహిత వాతావరణం ఆ యువకుడి లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే కర్బన‌ ఉద్గారాలను విడుదల చేయని వాహనాలు తయారు చేస్తున్నాడు. ఇంజినీరింగ్‌ చదివి వినూత్న ఆవిష్కరణలు చేస్తూ శభాష్ అనిపిస్తున్నాడు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే వందల కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చే వెహికల్స్‌ను రూపొందిస్తున్నాడు. సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా ఇటీవల హైబ్రిడ్ ఎలక్ట్రిక్‌ కారును రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకి ఎవరా యువకుడు? ఏంటా ఎలక్ట్రిక్‌ కారు ప్రత్యేకత? ఈ కథనంలో తెలుసుకుందాం

Garlapati Rakesh In Khammam
Hybrid Electric Car Designed By Rakesh In Khammam

హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారు రూపొందించిన రాకేష్‌ - సింగిల్​ ఛార్జ్​ చేస్తే 300 కి.మీ.

Hybrid Electric Car Designed By Rakesh In Khammam : చూస్తుంటే ఇదేదో వింటేజ్‌ కారులా అనిపిస్తుంది కదా కానీ, అది నిజం కాదు ఇది ఈ ఇంజినీరింగ్‌ యువకుడు రూపొందించిన ఓ వినూత్న ఆవిష్కరణ. పర్యావరణానికి మేలు చేయాలని ఉద్దేశం, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తితో ఈ విధంగా తయారు చేశాడు. ఫలితంగా మనోడి ప్రతిభ, నైపుణ్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు వచ్చింది. కారు నడుపుతున్న ఈ యువకుడి పేరు గార్లపాటి రాకేశ్‌. ఖమ్మంలోని శ్రీనివాస నగర్‌ ఇతడి స్వస్థలం. చిన్నప్పటి నుంచి కొత్త ఆవిష్కరణలు చేయడమంటే మహా ఇష్టం.

మీ కారు "గ్యారేజ్​కు దారెటు భయ్యా?" అంటోందా - ఇవి చెక్ చేయకుంటే అంతేమరి!

Garlapati Rakesh In Khammam : ఖమ్మం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. కళాశాల ప్రొఫెసర్ల సహకారంతో ద్విచక్రవాహనాల్లో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే విధంగా బ్యాటరీలను తయారు చేశాడు ఈ యువకుడు. పనిచేయని బైక్‌లను తీసుకుని లిథియం బ్యాటరీలను వాటికి అనుసంధానం చేసేవాడు రాకేష్‌. అలా చిన్న వర్క్‌షాపును ఏర్పాటు చేసి వినూత్నంగా ప్రయోగాలు చేశాడు. బైక్‌ నడుస్తున్నప్పుడే బ్యాటరీ ఛార్జింగ్‌ అయ్యేలా ప్రయత్నించాడు. అవి ఫలించి సుమారు 200కిలో మీటర్ల మైలేజ్ వచ్చేలా బైక్‌లను తయారు చేశాడు. ఆ ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టడంతో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ప్రోత్సహించాడని చెబుతున్నాడు రాకేష్‌.

"నాతో పాటు ఎవరైతే నూతన ఆవిష్కరణ ఆలోచనతో ఉన్నారో, కంపెనీలో ఎక్కడ జాబ్​ దొరకక ఇంజినీరింగ్​ చేసి చాలా మంది ఉన్నారు. వారందనీ నాతో ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను. 2019 నుంచి ఇతరులకు ఎంటర్​ప్రైనర్​షిప్​లో జాబ్​ కల్పించడానికి వందల మందికి కృషి చేస్తున్నాను. నా ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి కొద్దిగా సహాయం లభించిన, పూర్తి స్థాయిలో లభించాలని ఆశిస్తున్నాను."- గార్లపాటి రాకేశ్‌

400 Km Travel On Single Charge : బైక్‌పై చేసిన ప్రయోగం సక్సెస్‌ అవ్వడంతో కారును అలాగే రూపొందించాలని ప్రయత్నించాడు రాకేష్‌. అలాగే వింటేజ్‌ లుక్‌ వస్తూనే, వినూత్నంగా కనిపించేలా సరికొత్తగా కారును తీసుకురావాలకున్నాడు. పలు విఫల ప్రయత్నాల తర్వాత సక్సెస్‌ అయ్యాడు. హైబ్రిడ్‌ రకం అయిన ఈ ఎలక్ట్రిక్ కారులో ఉన్న బ్యాటరీ రెండు విధాల ఛార్జింగ్ అవుతుందని అంటున్నాడు. హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్ కారు తయారు చేసి వార్తల్లోకి ఎక్కాడు రాకేశ్. ఈ కారులో దూర ప్రయాణం చేయాలంటే ముందుగా పెట్రోల్‌తో 40 కిలో మీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.

TSRTC Electric Buses : భాగ్యనగర రోడ్లపై ఇక నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు.. రయ్‌.. రయ్‌

Rakesh Invention Selected Young Innovators Award : ఈ ప్రయాణ సమయంలో వాహనంలో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీలు ఛార్జింగ్‌ అవుతాయి. బ్యాటరీలకు కారుకు పైన ఏర్పాటు చేసి సోలార్‌ ప్యానెల్‌ ద్వారా ఎనర్జీ ఉత్పత్తి అవుతోంది. తద్వారా ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్‌ అయితే దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంటున్నాడు ఈ ఆవిష్కర్త. రెండు విధాలుగా ఛార్జింగ్ అయ్యే వెసులుబాటుతో సరికొత్త కారును ఆవిష్కరించి టీఎస్​ఐఐసీ నుంచి గుర్తింపు పొందాడు రాకేష్‌. టీ-హబ్‌లో ఈ కారును ప్రదర్శనకు పెట్టారు. ఫలితంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన యువ ఇన్నోవేటర్ల అవార్డుకు ఎంపికైంది ఈ ఆవిష్కరణ.

Rakesh Designed Hybrid Electric Car : ఈ జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోనున్నాడు. దేశవ్యాప్తంగా యువ ఇన్నోవేటర్లపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి పుస్తకంలో రాకేశ్ ఆవిష్కరణకు కూడా చోటు దక్కడం విశేషం. కాలుష్య రహిత ఆవిష్కరణల ద్వారా పలువురి ప్రశంసలు పొందుతున్నాడు రాకేష్‌. కొత్త ఆవిష్కరణలు తయారు చేయడమే కాకుండా నిరుద్యోగులైన ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఉపాధి చూపుతున్నాడు. ప్రభుత్వం సహకరిస్తే మరింత మంది నిరుద్యోగులకు తన ఆవిష్కరణల్లో భాగస్వామ్యం చేసి ఉపాధి కల్పిస్తానంటున్నాడు.

మన్యంలో పుట్టాడు.. నూతన ఆవిష్కరణలు చేశాడు.. అక్కకు బాసటగా నిలిచాడు..

Electric Vehicles: ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల కొనుగోలుకే ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.