తెలంగాణ

telangana

బలహీనమవుతోన్న బాల్యం - 17.74 శాతం మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం - Malnutrition Problems in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 9:12 AM IST

Children Malnutrition Problems in Telangana : రాష్ట్రంలో పిల్లల్లో పౌష్టికాహార లోపం నానాటికీ పెరిగిపోతుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన పౌష్టికాహారం అందక ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా మారుతున్నారు. లోపాన్ని అధిగమించేందుకు పిల్లలందరికీ రోజూ గుడ్డు, పాలు అందించాలని ప్రతిపాదించినా, ఆమోదం మాత్రం లభించలేదు. పరిపాలన లోపాలు, సకాలంలో సరకులు అందించలేని పరిస్థితులు, నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితుల్లేకుండా పోయాయి.

Children Suffering With Malnutrition
Children Malnutrition Problems in Telangana

Children Malnutrition Problems in Telangana : తెలంగాణలో బాల్యం బక్కచిక్కుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన పౌష్టికాహారం అందక బలహీనంగా మారుతున్నారు. పరిపాలన లోపాలు, సకాలంలో సరకులు అందించలేని పరిస్థితులు, నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ భోజనం పెట్టే పరిస్థితుల్లేకుండా పోయాయి. పిల్లలకు సరైన పోషకాలు అందకపోవడంతో ఎత్తుకు తగిన బరువు వయసుకు తగిన ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా మారుతున్నారు.

Children Suffering With Malnutrition In Telangana : మహిళాశిశు సంక్షేమశాఖ నెలకోసారి అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన 5 ఏళ్లలోపు చిన్నారుల అభివృద్ధి సూచీలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 18.93 లక్షల మంది చిన్నారుల బరువు, ఎత్తు వివరాలు నమోదు చేసినప్పుడు దాదాపు 17.74 శాతం మంది తక్కువ బరువుతో బక్కగా, బలహీనంగా ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 3.89శాతం మంది (దాదాపు 74వేలు) అత్యంత బలహీనంగా ఉన్నారని వెంటనే అదనపు పోషకాహారం అవసరమని గుర్తించింది. వీరిలోనూ మూడేళ్ల లోపు చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తెేలింది.

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల దైన్యస్థితి.. 10 శాతం మందిలో పౌష్టికాహార లోపం!

తెలంగాణ రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలు దాదాపు 19.29 లక్షల మంది ఉన్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు జాతీయ పౌష్టికాహారసంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించిన మార్గదర్శకాల మేరకు శిశు సంక్షేమశాఖ బాలామృతం అందిస్తోంది. దీంతో పాటు నెలకు 16 గుడ్లు, 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు భోజనం, స్నాక్స్‌, పాలు, రోజుకి ఒకటి చొప్పున నెలకు 30 గుడ్లు ఇస్తున్నారు. కానీ నిర్వహణ లోపాలు పిల్లలకు ఇబ్బందిగా మారాయి. ఇక్కడ ఇచ్చే కోడిగుడ్ల పరిమాణంలోనూ వ్యత్యాసాలున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం :ఇదే విషయమై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళాశిశు సంక్షేమశాఖ సమీక్షలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న గుడ్లు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత కొన్నినెలలుగా పప్పు, నూనె, పాల సరఫరా సరిగా జరగలేదు. కూరగాయల బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సరకులను అందించే బాధ్యత జిల్లా కొనుగోళ్ల కమిటీలకు అప్పగించింది. ప్రస్తుతం వీటి ద్వారా జిల్లా అధికారులు నిత్యావసరాలను పంపిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని ములుగు, కొత్తగూడెం, మెదక్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాల్లోని చిన్నారుల్లో పౌష్టికాహార సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

పౌష్టికాహార లోపంతో గిడసబారుతున్న దేశభవిత

ఆకలితో అల్లాడుతున్న ప్రపంచం, ఐరాస నివేదిక

ABOUT THE AUTHOR

...view details