తెలంగాణ

telangana

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 2:13 PM IST

Kodi Katthi Srinu Bail : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్​కు ఏపీ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత బెయిల్​ రాగా, కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు షరతులు విధించింది.

Etv Bharat
Etv Bharat

Kodi Katthi Srinu Bail: అధికార పీఠం దక్కించుకునే కుట్రపూరిత ప్రణాళికలో సామాన్యుడే సమిధ అనే విషయం చరిత్ర చెప్తోంది. అదే విషయాన్ని వర్తమానంలోనూ పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి. తమ నాయకుడు సీఎం కావాలన్న వెర్రి అభిమానం, తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్లు కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లు ఊచల వెనక్కి నెట్టింది. ఇంటికి దూరమై, నా అనే వాళ్లకు కొండంత దుఃఖాన్ని మిగిల్చింది.

కోడికత్తి కేసుగా పేరొందిన ఈ రాజకీయ చదరంగంలో బలమైన ప్రత్యర్థులకు చెక్​పెట్టే క్రమంలో పావుగా మారిన దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాసరావు కథ తుది అంకానికి చేరింది. ఎట్టకేలకు పోరాటం ఫలించింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. వృద్ధులైన తల్లిదండ్రులు, తన సోదరుడి ఎదురుచూపులు ఫలించాయి. ఓ వైపు న్యాయవాదుల పోరాటం, ప్రజా సంఘాల సహకారం వెరసి న్యాయదేవత దిగివచ్చింది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది

kodikatti case accused srinivas granted bail by high court: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విడుదలయ్యాక కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఈ సందర్భంగా శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది. 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేయగా.. నాటి నుంచి జైలులోనే మగ్గుతున్నాడు. ఇన్నాళ్లూ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్న శ్రీనివాస్​కు ఇవాళ బెయిల్​ మంజూరైంది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు రూ.25 వేలు పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. మీడియాతో మాట్లాడొద్దని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించింది.

దిల్లీలో ధర్నా :కోడికత్తి కేసులో న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరావు తల్లి, ప్రజాసంఘాలు దిల్లీలోని ఏపీ భవన్​లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. శ్రీనుకు మద్దతుగా పలు ప్రజాసంఘాల నాయకులు, సమతా సైనిక్‌ దళ్‌, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిరసనలో పాల్గొన్నాయి.

కేసు మొత్తం కొట్టేయాలి :నా కుమారుడికి బెయిల్‌ రావడం సంతోషంగా ఉందని శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నా కుమారుడి పరిస్థితి చూసి బాధపడని రోజంటూ లేదని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. 'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు.. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. జైలులో నా కుమారుడి ఆరోగ్యం పాడైపోయింది' అంటూ సావిత్రి వాపోయారు. ఇప్పటికైనా జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని నిందితుడి సోదరుడు పేర్కొన్నారు. కేసు మొత్తం కొట్టేస్తేనే న్యాయం జరిగినట్లుగా భావిస్తామని చెప్తూ.. నా తమ్ముడు హత్యా ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.

హర్షాతిరేకాలు :నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌ రావడంపై దళిత, పౌరసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా సీఎం జగన్‌ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీనివాస్‌ను ఐదేళ్లు జైలులో మగ్గిపోయేలా చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ మండిపడ్డారు. కోడికత్తి శ్రీను బయటకొచ్చి అన్ని వాస్తవాలు చెబుతారని పేర్కొన్నారు.

Jagan Cock Fight knife Case Hearing Adjourned వాయిదాల పర్వంలో కోడికత్తి కేసు.. తదుపరి విచారణ డిసెంబర్‌ 15కి వాయిదా

రేవంత్​ సర్కార్​ కీలక నిర్ణయం - ప్రవాస తెలంగాణ పౌరుల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్​డెస్క్

ABOUT THE AUTHOR

...view details